విషాదం: పుట్టింటికి వచ్చి ప్రాణాలు పోగొట్టుకుని..

9 Aug, 2021 07:10 IST|Sakshi
తల్లీ కొడుకు (ఫైల్‌)

ఒకరిని రక్షించబోయి మరొకరు... 

చెరువులో పడి తల్లి, కుమారుడు మృతి

యశవంతపుర(కర్ణాటక): ప్రమాదశాత్తు చెరువులో పడి తల్లి, కుమారుడు మృతి చెందిన విషాద ఘటన  దక్షిణ కన్నడ జిల్లా సుళ్య తాలూకా నెల్లూరు కేమ్రాజీ గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాలు...  మైల్కా ర్‌ నివాసి సంగీత (30), కుమారుడు అభిమన్య (4) రెండు రోజుల క్రితం  మాపలకజెలోని పుట్టింటికి వచ్చారు. ఉదయం మెల్కార్‌కు వెళ్లాల్సి ఉండగా తల్లి కొడుకు విహారానికి చెరువు వద్దకు వెళ్లారు.

ఈ క్రమంలో నాలుగేళ్ల చిన్నారి కాలుజారి చెరువులో పడ్డాడు. కొడుకును రక్షించే క్రమంలో సంగీత కూడా నీటిలో దిగి మునిగిపోయింది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. పుట్టింటికి వచ్చి ప్రాణాలు పోగొట్టుకుందని తల్లిదండ్రులు  కన్నీరు మున్నీరయ్యారు.

మరిన్ని వార్తలు