వివాహేతర సంబంధం: ప్రియుడి మోజులో పడి కన్న బిడ్డపై దారుణం

31 Jul, 2021 20:11 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వివాహేతర సంబంధం మోజులో పడి కన్న కుమారుడినే తల్లి హతమార్చిన ఘటన రాజమహేంద్రవరం సీతంపేటలో చోటు చేసుకుంది. త్రీటౌన్‌ పోలీసులు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివాసం ఉంటున్న మల్లెమొగ్గల లక్ష్మి తన కుమారుడు మంజునాథ్‌ (6) మంచంపై నుంచి పడిపోయి, గాయపడినట్టు పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. ఆ బాలుడు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.

ఆ బాలుడి తల, మెడ, ముఖంపై గాయాలుండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. పోస్టుమార్టం నివేదికతో పాటు, స్థానికుల నుంచి పోలీసులు పలు వివరాలు సేకరించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో మంజునాథ్‌ను అతడి తల్లి లక్ష్మి, ప్రియుడు బోనం దాసు హతమార్చినట్టు పోలీసులు గుర్తించారు. వారిద్దరినీ అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు.  
 

మరిన్ని వార్తలు