దిండుతో ఊరిరాడకుండా చేసి కొడుకును చంపిన తల్లి.. ఆపై

10 Aug, 2021 21:40 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలోని నాసిక్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి తన కొడుకు చదువుకోవడం లేదని దిండుతో ఊరిరాడకుండా చేసి చంపేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. నాసిక్‌లోని సాయి సిద్ధి అపార్ట్‌మెంట్‌కు చెందిన శిఖా సాగర్ పాఠక్‌ అనే మహిళ తన కొడుకు రిధాన్ సాగర్ పాఠక్‌ను చదువుకోమని చాలా సార్లు హెచ్చరించింది. అయితే అతడు ఆమెను మాటలు పట్టికోకుండా ఆన్‌లైన్‌లో చూస్తూ గడిపేవాడు. దీంతో విసుగుచెంది. సోమవారం సాయంత్రం 5 గంటలకు కొడుకు నోటికి దిండు అడ్డు పెట్టి పట్టుకుంది. దీంతో పిల్లవాడు ఊపిరాడక.. నోట్టో నుంచి రక్తం కక్కుని చనిపోయాడు. ఈ ఘటన తర్వాత శిఖా పాఠక్‌ కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

కుమార్తె, మనవడు చాలా సేపటి నుంచి బయటకు రాకపోవడంతో తలుపును తట్టారు. ఎంతకూ తీయకపోవడంతో డోర్‌ను పగులగొట్టి చూశారు. ఇద్దరు చనిపోయి ఉండటం చూసి కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటన గురించి సమాచారం  అందుకున్న ఇందిరానగర్‌ సీనియర్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ నీలేశ్‌ మైంకర్‌, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సోహైల్ షేక్ అక్కడికి చేరుకున్నారు. మృతదేహం దగ్గర వారికి సూసైడ్ నోట్ దొరికింది. అందులో మా మరణాకి ఎవరూ బాధ్యులు కాదని రాసిపెట్టి ఉంది.  పోలీసులు ఇద్దరి మృతదేహాలను శక పరీక్ష కోసం ప్రభుత్వ ఆస్పత్రికి పంపంచారు. 

మరిన్ని వార్తలు