తల్లి గొంతు కోసి తల తీసుకొని పరారీ

24 Oct, 2020 10:30 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న మృతురాలి కోడలు పద్మ

సాక్షి, నాగర్‌కర్నూల్‌: మద్యానికి బానిసైన కొడుకు కన్నతల్లిని అతిదారుణంగా చంపిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కొల్లాపూర్‌ మండలం సింగోటంలో సంగణమోని చంద్రమ్మ (65) తన కొడుకు రాముడు (40) ఒకే ఇంట్లో ఉంటున్నారు. మద్యానికి బానిసైన కొడుకు తల్లితో రోజూ డబ్బుల కోసం గొడవ పడుతుండేవాడు. శుక్రవారం రాత్రి కూడా మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని తల్లితో గొడవకు దిగాడు.  (గుంటూరు జిల్లాలో దారుణ హత్య)

అనంతరం తల్లి నిద్రిస్తున్న సమయంలో కొడవలితో విచక్షణ రహితంగా ఆమె గొంతు కోసి తలను తీసుకొని పరారయ్యాడు. కాగా.. నిందితుడికి ఇద్దరు భార్యలు ఉండగా, పది సంవత్సరాల కిందనే వారు భర్తని వదిలేశారని బంధువులు తెలిపారు. ప్రతి రోజు అర్థరాత్రి వరకు గొడవ పెట్టుకొని తల్లితో డబ్బులు తీసుకునేవాడని తెలిపారు. 

నిందితుడు గ్రామస్తులతో ఎప్పుడూ గొడవ పడుతూ.. అర్ధరాత్రి సమయం‍లో తలుపులు కొడుతూ భయబ్రాంతులకు గురిచేసే వాడని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. నపరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు