మహిళ, ఇద్దరు పిల్లలు చెరువులో దూకి ఆత్మహత్య.. మూడు రోజులుగా..

14 Feb, 2022 07:39 IST|Sakshi

మృతుల బంధువుల ధర్నా

పరారీలో భర్త కుటుంబం

సాక్షి, బెంగళూరు(బనశంకరి): బెళగావిలో ఒక వ్యాపార కుటుంబానికి చెందిన మహిళ, ఇద్దరు పిల్లలతో చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకోగా, భర్త, అత్తమామలను అరెస్టు చేసేంతవరకు అంత్యక్రియలు చేయబోమని మహిళ కుటుంబీకులు భీష్మించుకున్నారు. ఆదివారం బెళగావి బిమ్స్‌ ఆసుపత్రి మార్చురీ వద్ద మృతురాలు క్రిషా కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. ఆమె భర్త  మనీశ్, అతని కుటుంబమే ఆమెను హత్యచేశారని ఆరోపించారు.

వారందరినీ అరెస్ట్‌ చేసే వరకు మృతదేహాలను తీసుకునేదిలేదంటూ ధర్నా నిర్వహించారు. దీంతో మూడురోజుల నుంచి బిమ్స్‌ ఆసుపత్రి మార్చురీలోనే తల్లీపిల్లల మృతదేహాలు ఉన్నాయి. ఈ నెల 11 తేదీన బెళగావి హిండలగా గణపతి ఆలయం చెరువులో క్రిషా కేశ్వానీ (36), పిల్లలు వీరేన్‌ (07), బావీర్‌ (04) మృతదేహాలు తేలాయి. ఇది తెలిసిన వెంటనే భర్త మనీష్, కుటుంబసభ్యులు పరారయ్యారు. కాగా, ఆదివారం మనీష్‌ సోదరుడు మీడియాతో మాట్లాడుతూ క్రిషాకు వేరొకరితో సంబంధం ఉందని, అదే ఆత్మహత్యలకు కారణమని అన్నారు. 

చదవండి: (పిన్నితో వివాహేతర సంబంధం.. బాబాయ్‌కి తెలిసి..)

మరిన్ని వార్తలు