ప్రియుడితో కలిసి.. కన్న కూతురిని కడతేర్చిన తల్లి 

31 Aug, 2022 11:05 IST|Sakshi
నాగలక్ష్మి (ఫైల్‌) 

సాక్షి, నిజామాబాద్‌: అభంశుభం తెలియని బాలికను ప్రియుడితో కలిసి హత్యచేసిందో తల్లి.. వివరాల్లోకి వెళ్తే.. మక్లూర్‌ మండలంలోని చిన్నాపూర్‌ గండి అడవి ప్రాంతంలో పూర్తిగా కుళ్లిపోయిన ఆరేళ్ల బాలిక మృతదేహాన్ని మంగళవారం పోలీసులు గుర్తించారు. చిన్నారి మృతదేహం పూర్తిగా కుళ్లిపోగా వైద్యులు అక్కడే పోస్టుమార్టం చేశారు. నార్త్‌ రూరల్‌ సీఐ నరహరి కథనం మేరకు విజయవాడలోని భవానీపురానికి చెందిన కాపర్తి దుర్గా భవాని, గురునాథం భార్య భర్తలు గతంలో రెండేళ్లపాటు నిర్మల్‌లో మేస్త్రి పనిచేస్తూ జీవనం సాగించారు.

వీరికి నాగలక్ష్మి (6), గీతమాధవి (14 మాసాలు) అనే ఇద్దరు కూతుర్లున్నారు. అయితే నిర్మల్‌ నుంచి ఐదేళ్ల క్రితం విజయవాడలోని భవానీపురానికి వెళ్లిపోయారు. గతనెల 14న బంధువుల ఇంటికి వెళ్లివస్తానని ఇంటినుంచి వెళ్లి తిరిగి రాలేదు. పోలీసులు భవానీపురంలో మిస్సింగ్‌ కేసు నమో దు చేశారు. నిజామాబాద్‌లో ఆమె ఉందన్న సమాచారం మేరకు ఆమె భర్త గురునాథం జిల్లాకు వచ్చి ఎంక్వైరీ చేయగా నగరంలోని రైల్వేస్టేషన్‌లో ఆమె ప్రియుడైన బాన్సువాడ కొల్లూరుకు చెందిన దుండగుల శ్రీనుతో ఉండగా గుర్తించాడు.

చిన్నకూతురు గీతమాధురి ఆమె వెంట ఉండగా పెద్ద కుమార్తె ఎక్కడని ప్రశ్నించగా ఆమెను గొంతును లిమి చంపి అడవిలో పారేశామని సమాధానమిచ్చారు. దీంతో భర్త గురునాథం పోలీసులను ఆ శ్రయించగా భార్య దుర్గాభవాని, ప్రియుడు శ్రీనును అదుపులోకి తీసుకుని విచారించారు. చిన్నారిని నగరంలోని లలితామహల్‌ రైల్వే కమాన్‌ వద్ద హత్య చేసి మాక్లూర్‌ చిన్నాపూర్‌ గండిలో పడవేసినట్లు తెలిపారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. 
చదవండి: అల్లరి చేస్తున్నారని.. విద్యార్థులను చితకబాదిన హెచ్‌ఎం

మరిన్ని వార్తలు