పెద్దకూతురి ప్రేమ; పరువు పోయిందని కొడుకుతో కలిసి ఆత్మహత్య 

20 Jul, 2021 07:44 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

హోసూరు: ఓ అమ్మాయి ప్రేమ వ్యవహారం ఆమె తల్లీ, సోదరున్ని బలితీసుకుంది. వివరాలు.. క్రిష్ణగిరి సమీపంలోని మిండగిరి గ్రామానికి చెందిన మహాలింగం (51) బెంగళూరులో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య హంసవేణి (45), కూతుళ్లు ప్రియ (19), త్రిష (17), కొడుకు విష్ణు (13) ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రియకు పెళ్లి సంబంధం ఖరారు చేశారు. ఈ విషయం తట్టుకోలేని ఆమె ప్రియుడు తిరుపతి  ఆత్మహత్యాయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న ప్రియ కూడా పురుగుల మందు తాగింది.

ఈ సంఘటనలతో పరువు పోయిందని బాధపడిన ఆమె తల్లి హంసవేణి, మరో కూతురు త్రిష, కొడుకు విష్ణులు ఆత్మహత్య చేసుకోవాలని ఆదివారం రాత్రి తమ పొలంలోని బావిలో దూకారు. త్రిషకు ఈత రావడంతో ఈదుతూ బయట పడగా, హంసవేణి, విష్ణు నీట మునిగి మృతి చెందారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మరోవైపు ఆత్మహత్యాయత్నం చేసిన తిరుపతి, ప్రియలు వేర్వేరు ఆస్పత్రుల్లో కోలుకుంటుండడం గమనార్హం.

ఇద్దరు వంచకుల అరెస్టు


మైసూరు: మండ్యకు చెందిన సౌమ్య (29), చామరాజనగరకు చెందిన ప్రసాద్‌(30) అనే ఇద్దరిని మైసూరు పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరూ ఓ ఫైనాన్స్‌ కంపెనీ ఉద్యోగి సురేష్‌తో పరిచయం పెంచుకున్నారు. తమ బంగారం వేరొకరి వద్ద కుదువలో ఉందని, మీరు డబ్బులిస్తే విడిపించి మీకే అమ్ముతామని సురేష్‌ను నమ్మించి రూ.1.75 లక్షలను తీసుకున్నారు. తరువాత ఇద్దరూ మొబైల్‌ఫోన్లను స్విచ్చాఫ్‌ చేయడంతో బాధితుడు సాలిగ్రామ పోలీసులకు ఫిర్యాదు చేయగా, గాలించి ఇద్దరినీ అరెస్టుచేశారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు