ఐదేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. ఆపై..

17 Oct, 2021 08:08 IST|Sakshi

వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య 

సాక్షి, సోమల (చిత్తూరు): మండలంలోని కందూరు పంచాయతీలో శనివారం భర్త, అత్త, ఆడపడుచు వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తుడుంవారిపల్లి కి చెందిన ఓబులేశు, మౌనిక(22) ఐదేళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి కొడుకు ఓమ్‌సాత్విక్‌(2), కుమార్తె(6నెలలు) ఉన్నారు.

మౌనికను భర్త, అత్త, ఆడపడుచు వేధింపులకు గురిచేస్తున్నారు. శనివారం ఎక్కువ కావడంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి అమ్మమ్మ లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లక్ష్మీకాంత్‌ తెలిపారు. తల్లి కోసం పిల్లలు ఏడ్వడాన్ని చూసి స్థానికులు కంటతడి పెట్టారు. 

చదవండి: (పాము రాసిన విషాద గీతం)

మరిన్ని వార్తలు