సమోసాలు కొనిస్తానని.. ఆరేళ్ల బాలికపై దారుణం..

10 Apr, 2021 13:23 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భోపాల్‌: మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు ఏదో ఒక చోట మహిళలు, చిన్నారులు, యువతులపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన కామాంధుల్లో మార్పు రావడం లేదు. ముఖ్యంగా సొంత కుటుంబ సభ్యుల నుంచే ఆపదలు ఎదరవుతున్నాయి. దీంతో మనకు అండగా నిలుస్తారన్న వారే మన పాలిట రాక్షసులు గామారుతుండటంతో ఇంట్లో కూడా రక్షణ కరువైంది. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఓ దారుణ సంఘటన వెలుగు చూసింది. ఆరేళ్ల బాలికపై సొంత మేనమామ, తాతయ్య సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. బాలికను గదిలో బంధించి అతి కిరాతకంగా అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇక ఈ ఇదంతా బాధితురాలి సోదరుడి కళ్లేదుటే జరగడం మరింత కలిచి వేస్తోంది. అయితే ఈ ఘటన జరిగి ఎనిమిది రోజులవ్వగా.. గురువారం వెలుగులోకి వచ్చింది. బాలిక ప్రవర్తనలో మార్పు రావడం గమనించిన తల్లి.. కూతురిని నిలదీయడంతో అసలు విషయం బయట పడింది. 

గురువారం సాయంత్రం ఆఫీస్‌ నుంచి ఇంటికొచ్చిన తల్లి తన కూతురు ఎప్పటిలాగే నార్మల్‌గా కనిపించకపోడంతో ఏమైందని ప్రశ్నించింది. అయితే అమ్మ తిడుతుందని బాలిక భయపడిపోయింది. అనంతరం తల్లి గట్టిగా మందలించడంతో తనకు జరిగిన విషయాన్ని వివరించింది. దీంతో పోలీసులను ఆశ్రయించిన బాధితురాలి తల్లి.. నిందితులపై ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు మాట్లాడుతూ.. ఏడు, ఎనిమిది రోజుల ముందు బాలిక మామయ్య ఆమెను, తన మూడేళ్ల సోదరుడిని సమోసాలు కొనిస్తానని చెప్పి బంధువుల ఇంటికి తీసుకువెళ్ళారని వెల్లడించారు. ఇద్దరూ బాలికను ఒక గదిలో బంధించి లైంగిక దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. అయితే నిందితులు మైనర్ బాలికకు రూ.20 ఇచ్చి, ఈ సంఘటన ఎవరికీ చెప్పొద్దని కోరినట్లు తెలిపారు. నిందితుల్లో ఒకరు 48 ఏళ్ల తాత అని, మరొకరు మామ వరుస అయ్యే దూరపు బంధువు(20) అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులను పోక్సో యాక్ట్‌ కింద అరెస్టు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.

చదవండి: 'శీల' పరీక్షలో నవ వధువు ఫెయిల్‌.. పెద్దల షాకింగ్‌ తీర్పు
ఆస్తి ఇవ్వలేదని.. అక్కను చంపిన తమ్ముడు

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు