ఘోరం.. బెయిల్‌పై వచ్చి మళ్లీ బాధితురాలిపై గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డాడు

3 Aug, 2022 15:40 IST|Sakshi
బాధితురాలు

భోపాల్‌: అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ మానవ మృగం.. మరోసారి కిరాతకానికి పాల్పడింది. బెయిల్‌ మీద బయటకు వచ్చి మరీ స్నేహితుడితో కలిసి మళ్లీ బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇది ఇంతటితోనే ఆగలేదు.. 

మధ్యప్రదేశ్‌ జబల్‌పూర్‌ జిల్లాలో ఘోరం జరిగింది. అత్యాచార బాధితురాలిపై మళ్లీ అత్యాచారానికి తెగపడ్డాడు దుర్మార్గుడు. ఈసారి స్నేహితుడితో కలిసి అఘాయిత్యాన్ని పాల్పడి.. అంతటితో ఆగకుండా ఆ నేరాన్ని వీడియో తీశాడు. తన మీద పెట్టిన కేసును వెనక్కి తీసుకోకపోతే ఆ వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితురాలు మరోసారి పోలీసులను ఆశ్రయించింది. 

బాధితురాలికి ఇప్పుడు 19 ఏళ్లు. రెండేళ్ల కిందట.. ఆమెపై వివేక్‌ పటేల్‌ అనే నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.  ఆ సమయంలో కోర్టు అతనికి జైలు శిక్ష విధించింది. ఏడాది తర్వాత అతను బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఈ క్రమంలో ఇంట్లో ఆమె ఒంటరిగా ఉన్న టైంలో కత్తితో బెదిరించి తన స్నేహితుడితో కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పరారీలో ఉన్న వివేక్‌ నుంచి తనకు ప్రాణహాని ఉందని చెబుతోంది బాధితురాలు.

ఇదీ చదవండి: భర్త వివాహేతర సంబంధం! సహించలేక పసిబిడ్డకు ఉరేసి..

మరిన్ని వార్తలు