ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్‌

14 May, 2021 17:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ అరెస్ట్‌ చేసింది. ఆయనపై 124(A) ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు, 153(B) వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, 505 IPC బెదిరింపులకు పాల్పడటం, 120(B) కుట్రపూరిత నేరం సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఈ మేరకు కుటుంబసభ్యులకు నోటీసులు అందజేసింది. అనంతరం ఆయన్ని మంగళగిరి సీఐడీ కార్యాలయానికి తరలించినట్లు సమాచారం.

రఘురామ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు: సీఐడీ
ఎంపీ రఘురామకృష్ణరాజును హైదరాబాద్‌లో అరెస్ట్ చేశాం. వర్గాలు, కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పదవుల్లో ఉన్న వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. న్యూస్ ఛానళ్లు, వ్యక్తులతో కలిసి విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారు. 124(A), 153(A), 505 IPC, R/W 120(B) సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం.

మరిన్ని వార్తలు