మంటలు అంటుకుని ఎంపీ మనమరాలు మృతి

17 Nov, 2020 15:51 IST|Sakshi

బీజేపీ రీటా బహుగుణ జోషి నివాసంలో విషాదం

లక్నో: దీపావళి పండుగ రోజు బీజేపీ ఎంపీ రీటా బహుగుణ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రీటా మనమరాలు టపాసులు కాలుస్తుండగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు అంటుకోవడంతో తీవ్ర గాయాలపాలైన ఆరేళ్ల చిన్నారిని ప్రయాగ్‌రాజ్‌లోని ఆస్పత్రిలో చేర్పించారు. 60 శాతం వరకు కాలిన గాయాలతో అక్కడే చికిత్స పొందుతూ సోమవారం ఉదయం ఆమె మరణించింది. అయితే రీటా కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం గమనార్హం. వారి విజ్ఞప్తి మేరకు మీడియాకు పూర్తి సమాచారాన్ని తెలియజేయడానికి వైద్యులు నిరాకరించారు. (చదవండి: 40 లక్షల దొంగతనం: చివరికి.. )

ఇక ఈ ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేశవ ప్రసాద్‌ మౌర్య తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పాపను ఎయిర్‌లిఫ్ట్‌ ద్వారా ఢిల్లీ తీసుకువెళ్లాలని భావించామని, అయితే అంతలోనే దురదృష్టవశాత్తూ చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని వాపోయారు. ఆమె ఆ‍త్మకు శాంతి కలగాలని ఆయన ప్రార్థించారు. రీటా కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ విషాదకర ఘటన గురించి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య మాట్లాడుతూ.. ‘‘మొదట పాప బాగానే ఉన్నట్లు సమాచారం అందింది, కానీ అంతలోనే తను చనిపోయిందని తెలిసింది. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు’’ అన్నారు. ఈ ఘటన నేపథ్యంలో చిన్న పిల్లలు క్రాకర్స్‌ కాల్చే సమయంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. కాగా యూపీకి చెందిన రీటా బహుగుణ ప్రస్తుతం అలహాబాద్‌ నియోజవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు