ములుగు జిల్లాలో దారుణం.. బాలికపై వరుసకు సోదరుడు లైంగికదాడి

19 May, 2022 12:32 IST|Sakshi

సాక్షి, ములుగు(వరంగల్‌): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గుర్రేవులలో దారుణం జరిగింది. వావివరసలు మరిచి ఓ కామాంధుడు సొంత చిన్నాన్న కూతురిపైనే దారుణానికి ఒడిగట్టాడు. మైనర్‌ అని చూడకుండా లైంగిక దాడికి పాల్పడ్డాడు. పైగా ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. భయంతో బాలిక ఎవరికి చెప్పలేదు. అయితే కడుపునొప్పితో బాధపడుతున్న బాలికను ఆస్పత్రికి తీసుకెళితే గర్భవతిగా వైద్యులు ధ్రువీకరించారు. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న నిందితుడు పరారయ్యాడు.కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
చదవండి: రెండ్రోజుల్లో యువకుడు పెళ్లి.. పత్రికలు పంచుతూ

మరిన్ని వార్తలు