‘అది ఏకాభిప్రాయంతో కూడిన కలయికను సూచించదు’

1 Sep, 2021 17:16 IST|Sakshi

ముంబై: తన సహోద్యోగి భార్యపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నావికాదళ సభ్యునికి ముంబైలోని సెషన్స్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ సమయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఘటనా స్థలంలో కండోమ్‌ ఉండటం ఏకాభిప్రాయంతో కూడిన కలయికను సూచించదని కోర్టు పేర్కొంది. వివరాల్లోకి వెళితే.. బాధితురాలి భర్త ఏప్రిల్‌ 29న కేరళలో శిక్షణ కోసం వెళ్లాడు. ఆ సమయంలో పక్క క్వార్టర్స్‌లో ఉండే వ్యక్తి బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెకు చాక్లెట్‌ ఇచ్చాడు.

చదవండి: చట్టసభల్లో నిరసనకు హద్దులుండాలి

కొద్ది సేపటి తర్వాత ఆమెకు తీవ్రమైన తలనొప్పి మొదలైంది. దీంతో మళ్లీ తిరిగి వచ్చిన నిందితుడు ఆమెకు కొన్ని మందులు ఇచ్చాడు. తర్వాత బాధితురాలి నోరు నొక్కి ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో ప్రతిఘటించి అతడిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. అయితే వీలు కాకపోవడంతో తనకు తానుగా చేతి మణికట్టు వద్ద గాయం చేసుకుంది. కాగా ఈ విషయం బయటకు చెబితే నిందితుడు తన భర్తను తప్పుడు కేసులో ఇరికిస్తానని బెదిరించినట్లు బాధితురాలు పేర్కొంది. అయితే ఆమె తన భర్తకు జరిగిన విషయాన్ని తెలిపింది. బాధితురాలి భర్త ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో ప్రవేశ పెట్టారు.

చదవండి: రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లెలు బంగారం సొంత అన్న చోరీ

మరిన్ని వార్తలు