1,000 కోట్ల విలువైన డ్రగ్స్‌ సీజ్‌

10 Aug, 2020 11:55 IST|Sakshi

ముంబై: ముంబైలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఓడరేవుకు సమీపంలో కస్టమ్స్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో రూ. 1000 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. 191 కిలోల డ్రగ్స్‌ను అధికారులు సీజ్ చేశారు. హెరాయిన్‌ను అక్రమంగా రవాణ చేస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. దీంతో వారికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి డ్రగ్స్‌ను నిందితులు తీసుకొచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. కాగా.. ప్లాస్టిక్ పైపులకు వెదురు రంగు వేసి ఆయుర్వేద మందులంటూ స్మగ్లర్లు దిగుమతి చేసేందుకు ప్రయత్నించారు. (ఏటీఎం కార్డుతో దోచేశారు)

మరిన్ని వార్తలు