దొంగతనం కేసులో ‘క్రైమ్​ పెట్రోల్’  సీరియల్‌ యాక్టర్స్‌ అరెస్టు

19 Jun, 2021 19:21 IST|Sakshi

ముంబై : హిందీ బుల్లితెరపై ఓ క్రైం షో ద్వారా పాపులరిటీ సంపాందించిన ఇద్దరు నటీమణులను ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముంబైలోని ఆరే కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు దొంగిలించిన కేసులో సీరియల్‌ యాక్టర్స్‌ సురభి సుందర్‌లాల్‌ శ్రీవాస్తవ‌, ముక్తర్‌ షేక్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ హిందీలో ప్రముఖ టీవీ షోలు ‘సావ్​ధాన్​ ఇండియా’, ‘క్రైమ్​ పెట్రోల్’​లో నటించారు. వివరాల్లోకి వెళితే.. సురభి, ముక్తర్‌ ఇద్దరూ..రాయల్‌ పామ్‌ ఏరియాలోని ఓ అపార్ట్‌మెంట్లోలోని స్నేహితురాలి ఇంటికి పేయింగ్‌ గెస్ట్‌గా వెళ్లారు. ఈ క్రమంలో మే 18న అక్కడ పీజీగా ఉంటున్న మరో మహిళ దగ్గరున్న 3.28 లక్షల నగదు మాయమైంది.

ఈ సంఘటన జరిగిన వెంటనే ఇద్దరు నటీమణులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఆ ఇద్దరిపై అనుమానంతో ఆ మహిళ ఆరే పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అపార్ట్‌మెంట్‌ సీసీటీవీ దృశ్యాలు పరిశీలించగా.. మహిళ ఇంట్లోకి చొరబడినట్లు తేలింది. దీంతో పారిపోయిన యాక్టర్స్‌ను పోలీసులు ట్రేస్‌ చేసి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 50 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. కాగా తమ విచారణంలో కోవిడ్‌ లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయి.. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఈ దొంగతనానికి పాల్పడినట్లు నిందితులు అంగీరించినట్లు పోలీసులు తెలిపారు.

చదవండి: ఆరో పెళ్లికి సిద్ధమైన బాబా.. ఐదో భార్య ఫిర్యాదుతో

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు