బార్‌పై రైడ్.. సీక్రెట్ రూంలో 17 మంది మహిళలు.. పోలీసులు షాక్..

17 Dec, 2022 18:55 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర ముంబైలోని రెస్టారెంట్ అండ్ బార్‍పై రైడ్ చేసిన పోలీసులు లోపల చూసి షాక్ అయ్యారు. రహస్యంగా నిర్మించిన ఓ గదిలో 17 మంది మహిళలను చూసి అవాక్కయ్యారు. మరో నలుగురు మహిళలు బార్‌లో డాన్స్ చేస్తూ కన్పించారు.

దహిసార్‌ ప్రాంతంలో శుక్రవారం ఈ దాడులు చేసిన పోలీసులు మొత్తం 19 మంది కస్టమర్లు, ఐదుగురు సిబ్బందితో పాటు బార్ మేనేజర్‌ను అరెస్టు చేశారు. సీక్రెట్ రూంలో రహస్యంగా దాచిన 17 మంది మహిళలకు విముక్తి కల్పించారు.

ఇలాంటి రైడ్లు చేసినప్పుడు మహిళలను కన్పించకుండా దాచాలనే నిర్వహకులు రహస్యంగా ఓ గదిని నిర్మించి బలవంతంగా వారిని అందులో ఉంచారని అధికారులు తెలిపారు. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
చదవండి: వయసులో మూడేళ్లు చిన్నోడితో సహజీవనం.. పెళ్లి చేసుకోమని అడిగితే..

మరిన్ని వార్తలు