వృద్ధురాలిపై పైశాచికం: మద్యం తాగించి.. లైంగిక దాడికి పాల్పడి..

24 Nov, 2021 08:46 IST|Sakshi

వృద్ధురాలి హత్య..

భర్తసహా మరో ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు అనుమానం 

పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు?

సాక్షి, అబ్దుల్లాపూర్‌మెట్‌: ఓ వృద్ధురాలు హత్యకు గురికాగా, ఆమెకు మద్యం తాగించి లైంగికదాడి చేసి.. ఆపై హత్య చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో భర్త తోపాటు మరో ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని తారామతిపేటకు చెందిన ఇరగదిండ్ల ఆండాలు (58), ఆమె భర్త ఈదయ్య కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.

వీరి కుమారుడు మల్లేశ్‌ హయత్‌నగర్‌లో ఉంటూ అప్పుడప్పుడూ వచ్చి వెళ్తుండేవాడు. కాగా మంగళవారం ఉదయం 8.30 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన కృష్ణ.. మల్లేశ్‌కు ఫోన్‌ చేసి మీ అమ్మ ఇంట్లో చనిపోయి ఉందని, ఆమె శరీరంపై గాయాలు ఉన్నాయని సమాచారమిచ్చాడు. మల్లేశ్‌ ఇంటికి వచ్చి చూడగా ఆండాలు విగతజీవిగా పడి ఉంది. ఆమె చేతిపై, భుజాలు, మెడపై కమిలిపోయి బలమైన గాయాలు ఉన్నాయి.
చదవండి: కుక్క చేసిన పని.. రెండు కుటుంబాల మధ్య గలాటా

తన తల్లి హత్యపై తండ్రి ఈదయ్య, అదే గ్రామానికి చెందిన బొడిగ శ్రీకాంత్, దేవర సురేశ్‌లపై అనుమానం ఉందని మల్లేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్‌ సీఐ స్వామి ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. కాగా, మృతురాలు ఆండాలుకు ఈదయ్య మూడో భర్త అని స్థానికులు తెలిపారు. 

అత్యాచారం చేసి ఆపై హత్య చేశారా? 
ఆండాలుతో పాటు ఆమె భర్త ఈదయ్య, బొడిగ శ్రీకాంత్, దేవర సురేశ్‌ సోమవారం రాత్రి మద్యం సేవించారని స్థానికుల ద్వారా తెలిసింది. మద్యం మత్తులో ఉన్న శ్రీకాంత్, సురేశ్‌ ఆండాలుపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు ప్ర«థమికంగా నిర్ధారణకు వచ్చారు. పోస్టుమార్టం నివేదిక వస్తే కేసు చిక్కుముడి వీడే అవకాశం ఉంది.

ఈ కేసులో నిందితులకు ఈదయ్య సహకరించాడా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆండాలు హత్య కేసులో అనుమానితులు ఈదయ్య, శ్రీకాంత్, సురేశ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అండాలును తామే హత్య చేసినట్లు నిందితులు అంగీకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.   

మరిన్ని వార్తలు