'జై శ్రీ రామ్' అనలేదని దాడి

9 Aug, 2020 08:07 IST|Sakshi

ముస్లిం ఆటో డ్రైవ‌ర్‌పై దుండ‌గుల దాడి

ఆపై రిస్ట్‌ వాచ్‌, డ‌బ్బులు దొంగ‌త‌నం

జైపూర్: 'జై శ్రీరామ్'‌, 'మోదీ జిందాబాద్' అన‌నందుకు ఓ ముస్లిం ఆటో డ్రైవ‌ర్‌ను చిత‌క‌బాదిన ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళితే.. ఆటో న‌డుపుకునే క‌చ్వా అనే వ్య‌క్తి  శుక్ర‌వారం ఉద‌యం 4 గంట‌ల‌కు ఎప్ప‌టిలాగే ప్ర‌యాణికుల‌ను గ‌మ్య‌స్థానాల‌కు చేర‌వేసి తిరుగు ప్ర‌యాణ‌మ‌య్యాడు. ఈ క్ర‌మంలో ఓ కారులోని ఇద్ద‌రు వ్య‌క్తులు అత‌డిని అడ్డ‌గించి సిగ‌రెట్ ఇవ్వ‌మ‌ని అడిగారు. వాళ్లు అడిగింది ఇవ్వ‌బోతుండ‌గా 'జై శ్రీరామ్'‌, 'మోదీ జిందాబాద్' నినాదాలు ఇవ్వాల‌ని ఒత్తిడి తెచ్చారు. అందుకు అత‌ను అంగీక‌రించ‌క‌పోవ‌డంతో చెంప చెల్లుమ‌నిపించారు. (విషాదం: తండ్రి మరణంతో కూతుళ్లు కూడా..)

అక్క‌డితో ఆగ‌కుండా ఆవేశంతో క‌ర్ర‌ను తీసుకొని కచ్వాపై విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేశారు. వారి నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ వెంబ‌డించి మ‌రీ కొట్టారు. దీంతో అత‌ని ఎడ‌మ క‌న్ను వాచిపోగా, ప‌ళ్లు ఊడిపోయి తీవ్ర గాయాల‌య్యాయి. క‌చ్వాను పాకిస్తాను పంపేప‌ర‌కు తాము విశ్రాంతి తీసుకోమ‌ని హెచ్చ‌రించారని బాధితుడు చెప్పుకొచ్చాడు. త‌న రిస్ట్ వాచ్‌, డ‌బ్బుల‌ను కూడా లాక్కెళ్లార‌ని వాపోయాడు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఇద్ద‌రు నిందితుల‌ను అరెస్ట్ చేశారు. (ముగ్గురు చిన్నారులను కాపాడి.. ప్రాణాలు వదిలాడు)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా