పెళ్లి వేడుకలో వింత వేషధారణ

9 Jan, 2022 06:23 IST|Sakshi

మంగళూరు: పెళ్లి వేడుకలో హిందువుల మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలపై మంగళూరుకు చెందిన ఓ ముస్లిం పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు బంధువులపై కేసు నమోదైంది. బంట్వాల్‌ తాలూకా కొల్నాడు గ్రామంలో సాలెతూర్‌కు చెందిన అజీజ్‌ ఇంట్లో గురువారం రాత్రి జరిగిన వివాహ వేడుకకు బాషిత్‌ అనే వ్యక్తి హాజరయ్యాడు. ఈ సందర్భంగా తులునాడు ప్రాంతంలో హిందువులు ఎక్కువగా ఆరాధించే కొరగజ్జా అనే దేవుడి మాదిరిగా బాషిత్‌ తదితరులు దుస్తులు వేసుకుని, ఆ దేవుడిని అవమానించేలా డ్యాన్స్‌ చేశారు.

ఈ వీడియోను అతడి స్నేహితులు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. దీనిపై బంట్వాల్‌ తాలూకా విట్లపడ్నూర్‌ గ్రామానికి చెందిన చేతన్‌ ఫిర్యాదు మేరకు పెళ్లికొడుకు, పెళ్లి కూతురు బంధువులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు