విద్యార్థినిపై గూండాల అమానుషం.. స్నేహితుడి కళ్లెదుటే..

25 Aug, 2021 18:43 IST|Sakshi

దారి కాచి చుట్టుముట్టిన 6 గురు సభ్యుల  గ్యాంగ్‌

నగలు, నగదు డిమాండ్‌ చేసిన ముఠా

స్నేహితుడిని చితకబాది యువతిపై గ్యాంగ్‌రేప్‌

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. స్నేహితుడి కళ్లెదుటే యువతిపై ఒక గ్యాంగ్‌, సామూహిక అత్యాచారానికి పాల్పడిన వైనం ఆందోళన రేపింది. ఈ సంఘటన అవలహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోమంగళవారం రాత్రి ఈ ఉదంతం చోటుచేసుకుంది.  ఈ సంఘటన జరిగి దాదాపు 24 గంటలు గడిచినా, నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు.

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం మైసూర్ నగరానికి దాదాపు 13 కిలోమీటర్ల దూరంలోని ప్రసిద్ధ శ్రీ చాముండేశ్వరి దేవాలయం వద్ద దారికాచి ఆరుగురు వ్యక్తుల ముఠా వీరిని  చుట్టుముట్టింది.  యుతిపై లైంగిక వేధింపులకు  పాల్పడ్డారు. అనంతరం వారి వద్ద  ఉన్న నగలు, నగదు ఇమ్మని అడిగారు. దీనికి నిరాకరించడంతో వారిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఆమె ఫ్రెండ్‌ను తీవ్రంగా కొట్టి యువతిపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. 

బాధితులిద్దరూ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేశామనీ, బాధిత యువతి  స్టేట్‌మెంట్‌ రికార్డు చేయాల్సి ఉందని డీసీపీ ప్రదీప్ గుంటితెలిపారు. ఇంతవరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని, విచారణ కొనసాగుతోందన్నారు.ఉత్తరప్రదేశ్‌కు చెందిన పరిశోధనా విద్యార్థినిగా బాధిత యువతిని పోలీసులు గుర్తించారు. తన స్నేహితుడితో కలిసి సంఘటన జరిగిన ప్రదేశం నుంచే రోజూ ఇంటికి తిరిగి వచ్చేదని పోలీసులు వెల్లడించారు. ఇది గమనించే ఈ ముఠా  దారుణానికి పాల్పడి ఉంటుందనే అనుమానాలను వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు