నాగశౌర్య ఫామ్‌హౌస్‌ కేసు: కస్టడీలోకి ప్రధాన నిందితుడు

3 Nov, 2021 16:25 IST|Sakshi

హైదరాబాద్‌: హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌ పేకాట కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న గుత్తా సుమన్‌ను నార్సింగి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వైద్యపరీక్షలు జరిపిన తర్వాత.. నిందితుడు సుమన్‌ చౌదరిని  పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

పేకాట, క్యాసినో ఇతర కేసుల వివరాలపై ఆరాతీస్తున్నారు. కాగా, ఫామ్‌ హౌజ్‌దేని కోసం తీసుకున్నారు..? ఎవరెవరి పాత్ర ఉంది..? అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడి నుంచి కీలక సమాచారం రాబట్టనున్నట్లు తెలుస్తోంది. 

చదవండి: నాగశౌర్య ఫామ్‌హౌజ్‌ కేసు: బర్త్‌డే పార్టీ ముసుగులో పేకాట

మరిన్ని వార్తలు