కరెంట్‌ బిల్లు కట్టాలని మెసేజ్‌.. ఒక్క క్లిక్‌తో 1.68 లక్షలు మాయం!

4 Sep, 2022 21:17 IST|Sakshi

ముంబై: ఇటీవలి కాలంలో ఆన్‌లైన్‌ మోసాలు పెరిగిపోయాయి. సైబర్‌ నేరాలపై పోలీసులు ఎన్ని విధాల ప్రజలకు అవగాహన కల్పించినా ఫలితం లేకుండా పోతోంది. రోజుకో కొత్త రూపంలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ లక్షలు కొల్లగొడుతున్నారు దుండగులు. అలాంటి సంఘటనే మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో వెలుగు చూసింది. విద్యుత్తు బిల్‌ గురించి వచ్చిన ఓ ఫేక్‌ మెసేజ్‌పై ఒక్క క్లిక్‌తో ఓ వ్యక్తి రూ.1.68 లక్షలు పోగొట్టుకున్నారని నాగ్‌పూర్‌ పోలీసులు శనివారం వెల్లడించారు. 

మహారాష్ట్ర ఆధ్వర్యంలోని ఓ బొగ్గు పరిశ్రమలో పని చేస‍్తున్న రాజేశ్‌ కుమార్‌ ఆవధియా(46)కు ఆగస్టు 29న మొబైల్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది. విద్యుత్తు బిల్‌ చెల్లించనందున మీ పవర్‌ సప్లయ్‌ నిలిపేయనున్నట్లు అందులో పేర్కొన్నారు. బిల్‌ కట్టేందుకు కింది యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అందులో సూచించారు నేరగాళ్లు. దాంతో ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. ‘మెసేజ్‌లో సూచించిన లింక్‌పై క్లిక్‌ చేయగానే రెండు బ్యాంకు ఖాతాల్లోని రూ.1.68 లక్షలు మాయమయ్యాయి. ఐపీసీలోని చీటింగ్‌, ఐటీ యాక్ట్‌లు సహా పలు సెక్షన‍్ల కింద కేసు నమోదు చేశాం.’ అని ఖపెర్ఖేడా పోలీస్‌ స్టేషన్‌ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: రూ.6 కోట్ల దోపిడీ కేసు.. రూ.100 పేటీఎం బదిలీతో దొరికిపోయారు!

మరిన్ని వార్తలు