మళ్లీ కస్టడీలోకి డాక్టర్‌ నమ్రత

8 Aug, 2020 17:51 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: చిన్నారుల అక్రమ రవాణా కేసులో అరెస్టయిన సృష్టి ఆస్పత్రి ఎండీని పోలీసులు తిరిగి కస్టడీలోకి తీసుకున్నారు. నమ్రతతో పాటు గర్భిణులకు డెలివరీ చేయడంలో సహకరించిన మరో డాక్టర్‌ తిరుమలను కూడా  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పేద గర్భిణీలు, పిల్లలులేని దంపతులను లక్ష్యంగా చేసుకొని పలు అక్రమాలకు సృష్టి నమ్రత పాల్పడినట్లు ఇప్పటికే ఫిర్యాదులు ఉన్నాయి. ఇవాళ్టి నుంచి మరో రెండు రోజుల పాటు విశాఖ మహారాణిపేట పోలీసులు డాక్టర్‌ నమ్రతను విచారించనున్నారు. (పేగుబంధంతో పైసలాట!)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు