ఆన్‌లైన్ బెట్టింగ్ కేసు..4 రోజుల‌ క‌స్ట‌డీకి అనుమ‌తి

24 Aug, 2020 16:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ :  భారత్‌లోని మధ్య తరగతి యువతే టార్గె ట్‌గా, కలర్‌ ప్రిడిక్షన్‌ గేమ్‌ పేరుతో  బీజింగ్‌కు చెందిన సంస్థ ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పాల్ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో నిందితుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే  సమగ్ర విచారణ కోసం కస్టడీకి ఇవ్వాలని ఓరుతూ  సైబర్ క్రైమ్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖ‌లు చేశారు. నిందితులు ఎన్ని బ్యాంకుల‌కు ట్రాన్సాక్ష‌న్ చేశారు? క‌ంపెనీల లావాదేవీలు త‌దిత‌ర అంశాల‌పై ఇంకా విష‌యాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో నిందితుల‌ను నాలుగు రోజుల క‌స్ట‌డీకి నాంపల్లి  న్యాయస్థానం అనుమ‌తించింది.  చైనా దేశ‌స్తుడు స‌హా మ‌రో ముగ్గురు వ్య‌క్తులు  ఈ కేసులో ప్ర‌ధాన నిందితులుగా ఉన్నారు. (ఐఎస్‌ఐ ఆన్‌లైన్‌ 'గేమ్‌' ప్లాన్‌)

అయితే ఈ స్కాం వెనుక ఇంకా ఎంత మంది ఉన్నారో అన్న కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. రూ.1106  కోట్లు చైనాలోని బీజింగ్ టుమారో కంపెనీకి బదలీ  చేయడంపై అధికారులు దృష్టి సారించారు.  2019 లో కేవలం ఐదు కోట్ల రూపాయల బిజినెస్ చేసిన చైనా కంపెనీ..ఈ ఏడాది ఆరు మాసాల్లో 1102 కోట్ల రూపాయలు వ్యాపారం చేసిన‌ట్లు తేలింది. రెండు అకౌంట్లు ద్వారా హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్‌కు నగదు బదిలి చేసినట్లు అధికారులు నిర్ధారించారు. డాకిపే, లింక్ యు అనే కంపెనీ అకౌంట్ల ద్వారా రూ.1106 కోట్లు బదిలి అయినట్లు గుర్తించారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్‌తో అమాయ‌క ప్ర‌జ‌ల‌ను చైనా కంపెనీ మోసం చేసి వంద‌ల కోట్లు కొట్టేసింది. అయితే విచారణలో మరికొన్ని వాస్తవాలు బయటకు వచ్చే అవకాశాలున్నాయని  పోలీసులు భావిస్తున్నారు. నిందితులు పోలీసులకు సహకరిస్తే  మరి కొంతమందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. (చైనా బెట్టింగ్‌ కంపెనీ: దర్యాప్తు ప్రారంభించిన అధికారులు)

 
 

మరిన్ని వార్తలు