చిత్తూరు జిల్లాలో నంది విగ్రహం ధ్వంసం

28 Sep, 2020 04:17 IST|Sakshi
ధ్వంసం చేయకముందు ఆలయంలో నంది విగ్రహం

టీడీపీ నేతల ప్రమేయం ఉన్నట్లు గుర్తింపు

ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావడం.. మత విద్వేషాలు రెచ్చగొట్టడమే లక్ష్యం 

గంగాధరనెల్లూరు/పెనుమూరు: చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం అగర మంగళంలోని శ్రీఅభయాంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో శివాలయం ఎదుట ఉన్న పురాతన నంది విగ్రహాన్ని శనివారం రాత్రి కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఆలయం వెనుకభాగం నుంచి ప్రహరీగోడ దూకి లోనికి ప్రవేశించిన దుండగులు నందిని పెకలించి గుడి వెనుకకు తీసుకెళ్లి పగులగొట్టినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ కేసులో కొందరు టీడీపీ నాయకుల ప్రమేయాన్ని గుర్తించినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావడం, మత విద్వేషాలు రెచ్చ గొట్టడమే లక్ష్యంగా కొందరు పథకం ప్రకారం నంది విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది.

ఘటనాస్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ సెంథిల్‌ కుమార్‌ నేరుగా విచారణకు రంగంలోకి దిగారు. గంగాధరనెల్లూరు పోలీసు స్టేషన్‌లో ఆదివారం రాత్రి 3 గంటల పాటు 89 మంది అనుమానితులను విచారించారు. ఎస్పీతో పాటు విచారణలో ఉన్న చిత్తూరు ఎస్‌పీవో ఈశ్వర్‌రెడ్డి ఆదివారం రాత్రి 10 గంటలకు విలేకరులతో మాట్లాడుతూ నంది విగ్రహం ధ్వంసం కేసును మూడు బృందాల ద్వారా అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని చెప్పారు. గత కొంత కాలంగా ప్రార్థన మందిరాలపై పథకం ప్రకారం కొందరు దాడులకు పాల్పడుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయని, ఆ కోణంలో కూడా విచారణ జరుపుతున్నామని చెప్పారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా