కదులుతున్న ‘స్కిల్‌’ డొంక.. లోకేష్‌ పీఏ అమెరికాకు జంప్‌!

24 Sep, 2023 11:05 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: స్కిల్‌ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ఇక, చంద్రబాబు కేసులో భాగంగా ప్రస్తుతం ఏపీ సీఐడీ విచారిస్తోంది. మరోవైపు.. ఈ కేసుతో సంబంధం ఉన్న కొందరు వ్యక్తులు(పరోక్షంగా/ప్రత్యక్షంగా) దేశం దాటేస్తున్నారు. తాజాగా నారా లోకేష్‌ బాబు పీఏ కిలారు రాజేష్‌ చౌదరి అమెరికాకు జంప్‌ అయినట్టు తెలుస్తోంది.

వివరాల ప్రకారం.. చంద్రబాబు స్కిల్‌ స్కాం కేసులో జైలుగా ఉండగా.. ఆయన కుమారుడు నారా లోకేష్‌ ఢిల్లీలో మంతనాలు జరుపుతున్నారు. అయితే, ఢిల్లీ పెద్దలు లోకేష్‌ను పట్టించుకోకపోవడంతో చేసేదేమీ లేక.. హస్తినలోనే మకాం పెట్టారు. ఇక, లోకేష్‌ను అరెస్ట్‌ చేస్తారనే ఎల్లో మీడియా వార్తల నేపథ్యంలో ఆయన ఢిల్లీలోనే ఉంటున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉండగా, తాజాగా నారా లోకేష్‌ పీఏ కిలారు రాజేష్‌ చౌదరి దేశం నుంచి అమెరికాకు జంప్‌ అయినట్టు తెలుస్తోంది. కాగా, రాజేష్‌ను నారా లోకేషే అండర్‌ గ్రౌండ్‌లోకి పంపినట్టు పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 

మరోవైపు.. స్కిల్‌ స్కాంలో షెల్‌ కంపెనీల నిధులు లోకేష్‌కి రాజేషే మళ్లించారు. లోకేష్‌కు సంబంధించిన అన్ని ఆర్థికమైన వ్యవహారాలను రాజేష్‌ చూసుకుంటారు. ఇటీవల యువగళం యాత్రలోనూ రాజేష్‌ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు రిమాండ్‌ రిపోర్టులో సీఐడీ ఈ వివరాలను పేర్కొంది. ఇక, ఐటీ నోటీసుల్లో కూడా రాజేష్‌ పేరు ఉండటం గమనార్హం. రాజేష్‌పై అమరావతి కాంట్రాక్ట్‌ల్లో బ్లాక్‌ మనీ తరలించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఐటీ నోటీసుల్లో కూడా ఐటీ అధికారులు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఇక, చంద్రబాబు కస్టడీ విచారణలోనూ సీఐడీ ఇదే అంశంపై ఆయనను ప్రశ్నించింది. కాగా, రాజేష్‌ ఇన్ని రోజులు లోకేష్‌తో ఢిల్లీలో ఉండి సీఐడీ విచారణ ప్రారంభం కాగానే అమెరికాకు వెళ్లిపోయినట్టు సమాచారం. దీంతో, సీఐడీ.. రాజేష్‌ కోసం వెతుకుతోంది. 

ఇది కూడా చదవండి: ఈనాడు ఫోటోగ్రాఫర్‌పై బాలకృష్ణ చిందులు

మరిన్ని వార్తలు