సూసైడ్‌ లెటర్‌ రాసి నారాయణ కళాశాల లెక్చరర్‌ ఆత్మహత్య

6 Aug, 2022 12:02 IST|Sakshi

అనంతపురం: పట్టణంలోని నారాయణ కళాశాలలో ఫిజిక్స్‌ లెక్చరర్‌ పనిచేసే ప్రత్యూష (26) శుక్రవారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. రైల్వే పోలీసుల వివరాలమేరకు... ప్రత్యూష అప్పుడప్పుడు కడుపునొప్పితో బాధపడేదని, ఇందులో భాగంగానే ఈ ఘాతుకానికి పాల్పడిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె తల్లిదండ్రులు పేర్కొన్నారు.

ప్రత్యూష ఉదయం కళాశాల విధులకు హాజరై పర్మిషన్ తీసుకుని గుడ్డం సమీపంలోని రైల్వేట్రాక్‌కు చేరుకుని గూడ్స్‌రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. బ్యాగులో ఉన్న సూసైడ్‌ నోట్‌ను పరిశీలించగా తన చావుకు ఎవరూ బాధ్యులు కారని రాసి ఉంచిన ఉత్తరాన్ని స్వాదీనం చేసుకున్నామని రైల్వే ఎస్‌ఐ బాలాజీనాయక్‌ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.     

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు