ఇంటికి రావద్దన్నారని.. నారాయణ విద్యార్థి ఆత్మహత్య 

30 Oct, 2022 10:54 IST|Sakshi
ముఖేష్‌ (ఫైల్‌)

ఆనందపురం ( భీమిలి): మండలంలోని వెల్లంకిలో ఉన్న నారాయణ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ రామచంద్రరావు శనివారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా, వీరఘట్టం మండలం, తెట్టంగి గ్రామానికి చెందిన పొట్నూరు లక్ష్మణరావు, సుమతి దంపతులకు ఇద్దరు పిల్లలు శరణి, ముఖేష్‌  ఉన్నారు. వారిలో ముఖేష్‌ను ఈ ఏడాది మండలంలోని వెల్లంకిలో ఉన్న నారాయణ కళాశాల హాస్టల్‌లో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో చేర్పించారు.
చదవండి: తండ్రిని చంపితే రూ.3 లక్షలు..  తల్లిని కూడా చంపితే రూ.5 లక్షలు! 

ఇదిలా ఉండగా ముఖేష్‌ శుక్రవారం సాయంత్రం తల్లిదండ్రులకు ఫోన్‌ చేశాడు. అందరూ నాగులచవితికోసం ఇంటికి వెళ్తున్నారని తమ గదిలో నలుగురు విద్యార్థులమే మిగిలామని తాను కూడా ఇంటికి వస్తానని కోరాడు. అయితే ఇంటికి రావద్దని తల్లి దండ్రులు వారించారు. కాగా రాత్రి హాస్టల్‌లో నిర్వహిస్తున్న స్టడీ అవర్‌లో ఉన్న ముఖేష్‌ మధ్యలోనే తన గదిలోకి వెళ్లి, చేతిపై లైఫ్‌నిల్‌ అని రాసుకుని నైలాన్‌ తాడుతో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. ఇది గమనించిన కళాశాల సిబ్బంది కొన ఊపిరితో ఉన్న ముఖేష్‌ను తగరపువలసలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసును ఎస్‌ఐ నరసింహమూర్తి దర్యాప్తు చేస్తున్నారు.    

మరిన్ని వార్తలు