తమ్ముడికి ఐస్‌క్రీం ఇప్పించి ఇంటికి వెళ్లమని చెప్పింది.. ఆమె మాత్రం!

24 Apr, 2021 09:58 IST|Sakshi
స్వాతి బాయి

సాక్షి, రంగారెడ్డి : తన తమ్ముడికి ఐస్‌క్రీం ఇప్పించుకుని వస్తానని ఇంట్లోనుంచి వెళ్లిన యువతి కనిపించకుండా పోయిన సంఘటన నార్సింగిలో చోటుచేసుకుంది. నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... లలితాబాయి, రాందాస్‌ దంపతులు కుమార్తె స్వాతి బాయి, కుమారుడితో కలసి నార్సింగిలో నివసిస్తున్నారు. గురువారం సాయంత్రం స్వాతి బాయి(19) తన తమ్ముడికి ఐస్‌ క్రీం ఇప్పించుకుని వస్తానని ఇంట్లోనుంచి వెళ్లింది.

అతనికి ఐస్‌క్రీం ఇప్పించి ఇంటికి వెళ్లమని చెప్పి కనిపించకుండా పోయింది. రాత్రి ఇంటికి రాకపోవడం, తెలిసిన వారిని వాకబు చేసినా ఫలితం లేకపోవటంతో ఆమె తల్లి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఆమె ఆటోలో ఎంజీబీఎస్‌కు వెళ్లినట్టు గుర్తించారు. తల్లి ఫిర్యాదులో ఓ యువకుడిపై అనుమానం వ్యక్తం చేయడంతో ఆదిశగా విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

చదవండి: టెకీ ఘనకార్యం; పెళ్లి పేరుతో ఇంటికి రప్పించుకొని..
ఏం కష్టమొచ్చిందో.. బిడ్డను చంపి ఉరేసుకున్న తల్లి

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు