రూ.3,000 కోట్ల విలువచేసే డ్రగ్స్‌ స్వాధీనం

20 Apr, 2021 02:30 IST|Sakshi

300 కేజీల డ్రగ్స్‌ స్వాధీనం

కొచ్చి: అరేబియా సముద్రంలో భారత నేవీ రూ.3వేల కోట్ల విలువైన మత్తుపదార్థాలను పట్టుకున్నట్లు రక్షణశాఖ సోమవారం వెల్లడించింది. చేపలు పట్టే ఓ పడవలో మత్తుపదార్థాలను గుర్తించినట్లు పేర్కొంది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత నేవీకి చెందిన సువర్ణ షిప్‌ పాట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా, వారికొక చేపలు పట్టే పడవ కనిపించింది. అందులోని వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో నేవీ అధికారులు అందులోకి దిగి సోదాలు మొదలు పెట్టారు.

ఈ క్రమంలో వారికి 300 కేజీల మత్తు పదార్థాలు కనిపించాయి. దీంతో బోటులోని వ్యక్తు లను కొచ్చి తీరానికి తరలించి విచారణ జరుపు తున్నారు. బోటులోని అయిదుగురు శ్రీలంకు చెందినవారు. ఆ బోటు శ్రీలంకకు చెందినదని, పాకిస్తాన్‌ నుంచి బయలుదేరి భారత్, శ్రీలంక వైపుగా పయనిస్తుండగా పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుకున్న మత్తు పదార్థాల విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో దాదాపు రూ. 3 వేల కోట్లు ఉంటుందని వెల్లడించారు. తదుపరి విచారణను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ)కి అప్పగించనున్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు