Odisha: ఐదేళ్ల చిన్నారిపై లైంగికదాడి.. ఉన్నట్టుండి బాలిక అనారోగ్యం బారినపడడంతో

18 Oct, 2021 16:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భువనేశ్వర్‌: ఐదేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రంలోని నవరంగపూర్‌ జిల్లా తెంతులికుంఠి సమితిలో వెలుగుచూసింది. ఈ నెల 11వ తేదీన తెంతులికుంఠి గ్రామంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న చిన్నారిని పొరుగింటి యువకుడు ఏదో మాయమాటలు చెప్పి, ఎవ్వరూ లేని ప్రదేశానికి తీసుకువెళ్లి, ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై ఈ నెల 15వ తేదీన పోలీస్‌ కేసు నమోదు కావడంతో నిందితుడిని శనివారం అరెస్ట్‌ చేశారు.
చదవండి: విషాదం: 25వ అంతస్తు నుంచి పడి కవలలు మృతి

వివరాలిలా ఉన్నాయి.. ఈ నెల 14వ తేదీన ఉన్నట్టుండి బాలిక అనారోగ్యం బారినపడడంతో ఆ బాలికను తెంతులికుంఠి కమ్యూనిటీ ఆస్పత్రికి తల్లిదండ్రులు తీసుకువెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్‌ సొచికాంత లెంక బాలికపై లైంగికదాడి జరిగినట్లు నిర్ధారించారు. ఇదే విషయాన్ని బాలిక కూడా తెలపడంతో బాధితురాలి పెద్దనాన్న తెంతులికుంఠి పోలీస్‌స్టేషన్‌ ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేసి, ఆదివారం కోర్టులో హాజరుపరిచారు.
చదవండి: ముగ్గురు అక్కాచెల్లెళ్ల ప్రాణం తీసిన బిస్కెట్లు, చిప్స్‌..?

ఇదే ఘటన తెలుసుకున్న నవరంగపూర్‌ జిల్లా మా ఘొరో సంస్థ అధ్యక్షురాలు కాదంబినీ త్రిపాఠి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆమె పోలీస్‌ అధికారి ప్రమోద్‌కుమార్‌ నాయక్‌ను కలిసి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని మహిళలు, చిన్నారులకు రక్షణ కరువైందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి, చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.  

మరిన్ని వార్తలు