ప్రేమపై తుపాకీ.. నెల్లూరు: పెద్దలు ఒప్పుకోలేదని యువతిని కాల్చి చంపి ప్రియుడి ఆత్మహత్య

9 May, 2022 16:51 IST|Sakshi

సాక్షి, నెల్లూరు:  ఒకే ఊరి వాళ్లు.. ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌లే. ఈ క్రమంలోనే ఆ యువతితో పరిచయం పెరిగింది. అది ప్రేమగా తీసుకున్నాడు యువకుడు. పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. కానీ ఆ యువకుడ్ని పెళ్లి చేసుకోవాలని యువతి అనుకోలేదు. దీనిపై ఇద్దరి మధ్య తరచు వాగ్వాదం జరుగుతూనే ఉంది. మరోసారి సోమవారం యువతి ఇంటికి వెళ్లిన యువకుడు మళ్లీ గొడవ పడ్డాడు. ఆ యువతిని రివాల్వర్‌తో కాల్చి చంపి.. తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

యువతిని తుపాకీతో కాల్చిన.. ఆపై తాను కాల్చుకుని అక్కడిక్కడే మృతి చెందాడు. కాల్పులు జరిపిన వ్యక్తిని సురేష్‌గా గుర్తించారు. బాధితురాలిని కావ్యగా గుర్తించిన పోలీసులు.. ఆస్పత్రికి తరలించే క్రమంలో ఆమె మృతి చెందినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. మృతులిద్దరూ తాటిపర్తి వాసులే కాగా..  చెన్నైలో ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలోనే యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని వేధించాడు. ఇది వన్‌సైడ్‌ లవ్‌ కావడంతో పెళ్లికి యువతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో విచక్షణ కోల్పోయి కాల్పుల ఘాతకానికి ఒడిగట్టాడు.

మరిన్ని వార్తలు