మళ్లీ మత్తు దోపిడీ

21 Oct, 2020 07:26 IST|Sakshi

సాక్షి, మల్లాపూర్‌: నేపాలీ గ్యాంగ్‌ మరోసారి పంజా విసిరింది. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని నార్సింగి, రాయదుర్గం, రాచకొండలోని కుషాయిగూడ ఠాణా పరిధిలో జరిగిన దోపిడీల తరహాలోనే తాజాగా నాచారం ఠాణా పరిధిలో సోమవారం మధ్యాహ్నం మరో భారీ చోరీ జరిగింది.  కుటుంబ సభ్యులు బయటికి వెళ్లడాన్ని ఆసరాగా తీసుకున్న నేపాలీ జంట ఇంట్లోటున్న వృద్ధురాలికి ఆహారంలో మత్తుమందు కలిపి ఇచ్చారు. ఆమె స్పృహ కోల్పోగానే బీరువాలో ఉన్న రూ.10 లక్షల నగదు, 18 తులాల బంగారం, 40 తులాల వెండి ఆభరణాలతో ఉడాయించారు.  

పక్కా ప్లాన్‌... 
బాధితులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.నాచారం హెచ్‌ఎంటీనగర్‌ రోడ్‌ నెంబర్‌–4/ఎ లో నివాసం ఉంటున్న చింతపల్లి ప్రదీప్‌కుమార్‌ బంజారాహిల్స్‌లో యాడ్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు.  

 • అతడి భార్య మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పుత్రిలో హెడ్‌నర్స్‌గా పని చేస్తోంది.  వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రదీప్‌కుమార్‌ తల్లి లలితమ్మ(60) కూడా వీరితో పాటే ఉంటోంది. 
 • వీరి ఇంట్లో ఆరు నెలల  క్రితం పని చేస్తున్న నేపాలీ జంట మానేయడంతో ఉప్పల్‌కు చెందిన లక్ష్మీనారాయణ అనే ఏజెంట్‌ ద్వారా అర్జున్, మాయ అనే మరో నేపాలీ జంటను 14 రోజుల క్రితం ఇంట్లో పనికి పెట్టుకున్నారు. 
 • సోమవారం ప్రదీప్‌కుమార్, అతని కుమారుడు ఆఫీసులకు వెళ్లిపోయారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రదీప్‌కుమార్‌ భార్య, కుమార్తెతో కలిసి మేడ్చల్‌లోని బంధువుల ఇంటికి వెళ్లింది. 
 • అదే అదనుగా అర్జున్, మాయ ఇంట్లో ఉన్న వృద్ధురాలు లలితమ్మకు ఆహారంలో మత్తు మందు కలిపి ఇచ్చి çస్పృహæ కోల్పోయేలా చేశారు.  
 • అనంతరం లాకర్‌ను బద్దలు కొట్టి అందులో ఉన్న 18 తులాల బంగారం, 40 తులాల వెండి, రూ.10 లక్షల నగదు దోచుకుని పారిపోయారు. 
 • రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చిన ప్రదీప్‌కుమార్‌  తల్లి స్పృహ లేకుండా పడి ఉండటాన్ని గుర్తించి నాచారం పోలీసులకు సమాచారం అందించి, తల్లిని గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించాడు. 
 • ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్‌ టీంతో కలిసి ఆధారాలు సేకరించారు. దోపిడీ జరిగిన ఇంట్లో సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో కాలనీల్లోని సీసీటీవీ కెమెరాల పుటేజీని పరిశీలించారు. అయితే ఒక్క కెమెరాలోనూ వారి ఫొటోలు రికార్డుకాలేదని తేలింది.  
 • అయితే సోమవారం మధ్యాహ్నం 3.30 ప్రాతంలో డ్రిల్లింగ్‌ చేసిన శబ్దాలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. 
 • సమాచారం అందుకున్న  మల్కాజ్‌గిరి డీసీపీ రక్షిత కె.మూర్తి, అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్‌రావు, ఏసీపీ శ్యాంప్రసాద్‌రావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
 • నిందితులను పట్టుకునేందుకు ఎనిమిది ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఎస్‌ఓటి, సీసీఎస్, క్రైమ్‌ పోలీసులు  పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. 
 • వారిని పనికి కుదిర్చిన ఏజెంట్‌ లక్ష్మీనారాయణతో పాటు మరో నేపాలీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.  
 • ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న లలితమ్మ స్పృహలోకి వస్తే  కేసుపై స్పష్టత వచ్చే అవకాశముందని పోలీసులు పేర్కొన్నారు.

కొకైన్‌ విక్రయిస్తున్న నైజీరియన్‌ అరెస్టు
సాక్షి, హైదరాబాద్‌: నైజీరియా నుంచి స్టూడెంట్‌ వీసాపై నగరానికి వచ్చి డ్రగ్‌ పెడ్లర్‌గా మారి కొకైన్‌ విక్రయిస్తున్న డానియల్‌ అమతుండే ఒలామిడేను పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి ఆరు గ్రాముల మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు మంగళవారం వెల్లడించారు. 2014లో నైజీరియా నుంచి స్టూడెంట్‌ వీసాపై వచ్చిన డానియల్‌ బండ్లగూడలోని సన్‌ సిటీలో ఉంటూ కూకట్‌పల్లిలోని ఓ కాలేజీలో బీకాం చదువుతున్నాడు. తరచు పబ్‌లకు వెళ్లే ఇతడికి డ్రగ్స్‌ దందా చేసే జాన్‌ పౌల్‌తో పరిచయమైంది. ఇతడు కూడా నైజీరియనే కావడంతో ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. పౌల్‌ సలహా మేరకు నగరంలో డ్రగ్‌ పెడ్లర్‌గా మారిన డానియల్‌ కొకైన్‌ గ్రాము రూ.8 వేలకు విక్రయిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.గట్టుమల్లు నేతృత్వంలోని బృందం మంగళవారం వలపన్ని పట్టుకుంది. ఇతడి నుంచి స్వా«ధీనం చేసుకున్న డ్రగ్, వాహనంతో సహా తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని లంగర్‌హౌస్‌ పోలీసులకు అప్పగించారు.  
   

ముంబై వ్యాపారినీ ముంచేశారు

సాక్షి, హైదరాబాద్‌: నగరానికి చెందిన ఇద్దరు వ్యాపారుల కరెంట్‌ ఖాతాల నుంచి ఈ ఏడాది జూన్‌లో రూ.86 లక్షలు కాజేసిన అంతర్జాతీయ సిమ్‌ స్వాపింగ్‌ గ్యాంగ్‌ ముంబైలోనూ పంజా విసిరింది. ఈ నెల మొదటి వారంలో అక్కడి ఓ పెట్రోల్‌ బంక్‌ యజమాని అధికారిక ఖాతా నుంచి రూ.2 కోట్లు స్వాహా చేసింది. ఈ ముఠాలోని ముగ్గురు నిందితుల్ని సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రెండు రోజుల క్రితం అరెస్టు చేసిన విషయం విదితమే. వీరి విచారణ, సెల్‌ఫోన్లు పరిశీలనలోనే ముంబై విషయం వెలుగులోకి వచ్చింది.  

 • నైజీరియాకు చెందిన షెడ్రిక్‌ పాల్, పశ్చిమ బెంగాల్‌లోని కళ్యాణి ప్రాంతానికి చెందిన సాగర్‌ మహతో ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారు.  
 • ముంబైలోని బాంద్రా ప్రాంతానికి చెందిన కమల్‌మఖీజా హిందుస్తాన్‌ పెట్రెలియం సంస్థకు డీలర్‌గావ్యవహరిస్తున్నాడు.  
 • షెడ్రిక్‌ నైజీరియా నుంచి అతడి అధికారిక ఈ–మెయిల్‌ ఐడీకి ఓ మాల్‌వేర్‌ పంపి దాని ఆధారంగా కమల్‌కు చెందిన  లావాదేవీలను తెలుసుకున్నాడు.  
 • సదరు వ్యాపారికి చెందిన బ్యాంకు ఖాతాల వివరాలు, యూజర్‌ నేమ్స్, పాస్‌వర్డ్స్‌తో పాటు వాటికి లింకై ఉన్న ఫోన్‌ నంబర్లనూ సేకరించి సాగర్‌కు పంపాడు.  
 • దీంతో అతను తన గ్యాంగ్‌ సభ్యులను ముంబై పంపి తొలుత ఓ ఖాళీ సిమ్‌ కార్డు ఖరీదు చేయించాడు. ఈ విషయాన్ని  నైజీరియాలో ఉన్న షెడ్రిక్‌కు తెలిపాడు.  
 • సిమ్‌ స్వాపింగ్‌కు సిద్ధమైన అతగాడు ఓ రోజు కమల్‌కు చెందిన ఈ–మెయిల్‌ ద్వారా సదరు సెల్‌ఫోన్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌కు ప్రస్తుతం పని చేస్తున్న సిమ్‌ డీ యాక్టివేట్‌ చేసి, తాను ఖరీదు చేసిన ఎమ్టీ సిమ్‌ను అదే నంబర్‌తో యాక్టివేట్‌ చేయాలని మెసేజ్‌ పంపాడు. 
 • ‘మెయిల్‌ సెంట్‌’ అని వచ్చిన వెంటనే ఔట్‌ బాక్స్, ట్రాష్‌ల్లో అది లేకుండా డిలీట్‌ చేసేశాడు. ఒకవేళ కమల్‌ తన మెయిల్‌ ఓపెన్‌ చేసుకున్నా ఇది కనిపించకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నాడు. 
 • అయితే కమల్‌ వినియోగిస్తున్న ఫోన్‌ కంపెనీ పేరుతో లేకపోవడంతో ఈ–మెయిల్‌ను సర్వీస్‌ ప్రొవైడర్‌ పట్టించుకోలేదు. దీంతో షెడ్రిక్‌ ‘ప్లాన్‌ బి’ సాగర్‌ ద్వారా అమలు చేయించాడు. 
 • ముందుగా వేరే సిమ్‌ నుంచి కమల్‌ ఫోన్‌కు రెండు కాల్స్‌ చేశాడు. ఆపై సర్వీస్‌ ప్రొవైడర్‌కు ఫోన్‌ చేసి తన సిమ్‌కార్డు పోయిందని, దానిని బ్లాక్‌ చేసి తాజాగా తీసుకున్న ఎమ్టీ సిమ్‌ యాక్టివేట్‌ చేయాలని కోరాడు. 
 • సర్వీస్‌ ప్రొవైడర్‌కు చెందిన ప్రతినిధి ఈ పనులు చేయడానికి ముందు కస్టమర్‌ను ఖరారు చేసుకుంటాడు. దీనికోసం ఆఖరుగా వచ్చిన ఇన్‌కమింగ్‌ లేదా ఔట్‌ గోయింగ్‌ కాల్స్‌ వివరాలు చెప్పమంటాడు. 
 • అలా అడిగినప్పుడు సదరు ప్రతిని«ధికి అనుమానం రాకుండా సాగర్‌ పథకం ప్రకారం కమల్‌ ఫోన్‌కు రెండు కాల్స్‌ చేసి, ఏవేవో మాట్లాడి, రాంగ్‌ నంబర్‌ అంటూ పెట్టేశాడు.  
 • ఈ రెండు నంబర్లు చెప్పిన సాగర్‌ అతడి వద్ద ఉన్న సిమ్‌ బ్లాక్‌ చేయించి... తన వద్ద ఉన్న ఎమ్టీ సిమ్‌ యాక్టివేట్‌ అయ్యేలా చేశాడు. ఈ వివరాలన్నింటినీ ఇతడు నైజీరియాలో ఉన్న షెడ్రిక్‌కు చెప్పాడు.  
 • అప్పటికే సదరు వ్యాపారికి చెందిన బ్యాంకు ఖాతా వివరాలు, తన ముఠా సభ్యుల నుంచి అందిన డమ్మీ వ్యక్తుల కరెంట్‌ బ్యాంకు ఖాతాలు షెడ్రిక్‌ వద్ద ఉన్నాయి.  
 • వ్యాపారి పేరుతో తీసుకున్న డూప్లికేట్‌ సిమ్‌కార్డుకే ఓటీపీలు రావడంతో వీటిని వినియోగించిన షెడ్రిక్‌ ఈ నెల 5 రాత్రి సదరు వ్యాపారికి చెందిన బ్యాంకు ఖాతా నుంచి 31 లావాదేవీల్లో రూ.2 కోట్లను తమ డమ్మీ ఖాతాల్లోకి బదిలీ చేశాడు.  
 • u ఈ మొత్తాన్ని సాగర్‌ తదితరులు తమ అనుచరుల ద్వారా డ్రా చేయించారు. దీనిపై కమల్‌ ఫిర్యాదు మేరకు ఈ నెల 6 కేసు నమోదు చేసిన ముంబైలోని బీకేసీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నేరగాళ్లకు చెందిన ఓ ఖాతాలో ఉన్న రూ.40 లక్షలు మాత్రం ఫ్రీజ్‌ చేయించగలిగారు.  
 • u నగర వ్యాపారులకు రూ.86 లక్షలు టోకరా వేసిన కేసును దర్యాప్తు చేసిన సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌ నేతృత్వంలోని బృందం పశ్చిమ బెంగాల్‌ వెళ్లి సాగర్‌ తదితరుల్ని అరెస్టు చేసి తీసుకువచ్చింది. 
 • u సాగర్‌ ఫోన్‌లో షెడ్రిక్‌తో జరిగిన చాటింగ్స్‌ను పరిశీలించిన గంగాధర్‌ ముంబై వ్యాపారికీ టోకరా వేసినట్లు గుర్తించారు. ఈ మేరకు అక్కడి అధికారులకు సమాచారం అందించారు. 
 • u ఈ ముఠా టార్గెట్‌ చేసిన సిమ్‌ ప్రీ–పెయిడ్‌ అయితే ఒకసారి కొంత మొత్తం రీచార్జ్‌ చేయించేది. ప్రస్తుత సిమ్‌ బ్లాక్‌ చేయడానికి, ఎమ్టీ సిమ్‌ యాక్టివేట్‌ చేయడానికి సర్వీస్‌ ప్రొవైడర్‌ ఆఖరి రీచార్జ్‌ తేదీ, ఎంత మొత్తం అనేది అడుగుతారు. అందుకే ఇలా చేయించాడని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.  
Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు