తెలుగు అకాడమీ స్కాంలో వెలుగుచూసిన కొత్త కోణం

12 Oct, 2021 20:27 IST|Sakshi

ఏపీలోని రెండు సంస్థల నుంచి డబ్బు కొట్టేసిన సాయికుమార్‌ ముఠా

సాక్షి, అమరావతి/హైదరాబాద్‌: తెలుగు అకాడమీ స్కాంలో కొత్త కోణం వెలుగు చూసింది. ఏపీలోని రెండు సంస్థల నుంచి సాయికుమార్‌ ముఠా డబ్బు కొట్టేసింది. ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌లో రూ.10 కోట్లును కొట్టేసిన సాయికుమార్‌.. ఏపీ సీడ్స్‌ కార్పొరేషన్‌లో రూ.5 కోట్ల ఎఫ్‌డీలను డ్రా చేశాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రెండు సంస్థల నుంచి రూ.15 కోట్లు సాయికుమార్‌ డ్రా చేసినట్లు పోలీసులు గుర్తించారు. (చదవండి: ఇల్లరికం అల్లుడు.. అత్తారింట్లో ఏం చేశాడంటే..!)

ఏపీ సంస్థల నుంచి డిపాజిట్లను ఐవోబీ బ్యాంక్‌ నుంచి బదిలీ చేశారు. ఐవోబీ నుంచి ఏపీ మర్కంటైల్‌ కోఆపరేటివ్‌ సొసైటీ ద్వారా బదిలీ, విత్‌ డ్రా చేయగా, ఏపీకి చెందిన ఫిక్సిడ్‌ డిపాజిట్లను కాజేసినట్లుగా సీసీఎస్‌ పోలీసులు గుర్తించారు. ఏపీ అధికారులకు సీసీఎస్‌ పోలీసులు సమాచారం ఇచ్చారు. సాయికుమార్‌ ముఠాపై రెండు కేసులు నమోదు చేసేందుకు ఏపీ పోలీసులు రంగం సిద్ధం చేశారు. అకాడమీలో కొట్టేసిన రూ.60 కోట్ల రికవరీపై పోలీసులు దృష్టి పెట్టారు.
చదవండి:
అత్త తిట్టిందని.. కోడలు ఎంత పని చేసిందంటే..!  

మరిన్ని వార్తలు