మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో కొత్త కోణాలు.. వెంకట్‌ లీలలు వెలుగులోకి..

1 Sep, 2023 13:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. అరెస్టయిన సినీ ఫైనాన్షియర్‌ వెంకట్‌ అక్రమాలపై నార్కోటిక్ ఆరా తీస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కలిపి 25కుపైగా కేసులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఐఆర్ఎస్ అధికారినంటూ వెంకట్ మోసాలు పాల్పడినట్లు తేలింది. నిర్మాతలు సి.కల్యాణ్‌, రమేష్‌ల నుంచి ఐఆర్‌ఎస్‌ అధికారినంటూ రూ.30 లక్షలకుపైగా వెంకట్‌ కొట్టేశాడు.

ఒక ఐఆర్‌ఎస్‌ అధికారిని సైతం పెళ్లి పేరుతో మోసం చేసినట్లు సమాచారం. సినిమాలో అవకాశాల పేరిట అమ్మాయిలకు వల వేసి.. ఇతర రాష్ట్రాల నుంచి రప్పించి వ్యభిచారం చేయించడంతో పాటు, పెళ్లి పేరుతో ఎన్‌ఆర్‌ఐ నంటూ విదేశీ యువతలను సైతం వెంకట్‌ మోసం చేసినట్లు బట్టబయలైంది.

ఏపీకి చెందిన ఓ ఎంపీ పేరు చెప్పి వసూలు చేస్తున్న వెంకట్‌.. సినీ, రాజకీయ నాయకులను పార్టీలకు పిలిచి బురిడీ కొట్టించాడు.వెంకట్‌ కాంటాక్ట్‌లో ఉన్న వాళ్లను ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.
చదవండి: మాదాపూర్ డ్రగ్స్ కేసు: టాలీవుడ్‌లో ప్రకంపనలు.. ఆ 18 మంది ఎవరు?

మరిన్ని వార్తలు