దీప అలా ఎందుకు చేసింది.. అతనే కారణమా..?

29 Apr, 2022 09:17 IST|Sakshi

తిరువొత్తియూరు: పుదుక్కోట్టై æజిల్లాలో వివాహమైన 3 నెలలకే నవ వధువు ఆత్మాహుతి చేసుకుంది. దీనికి సంబంధించి మాజీ ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. పుదుక్కొట్టై జిల్లా తిరుమయం సమీపం కొప్పరపు పట్టి, ఆరియన్‌కాడు గ్రామానికి చెందిన పుష్పరాజ్, అతని భార్య దీప (25). వీరికి మూడు నెలలకు క్రితం వివాహమైంది.

ఈ క్రమంలో గురువారం దీపా ఇంటిలో ఒంటరిగా ఉన్న సమయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీప తల్లి యశోద ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. విచారణలో అదే ప్రాంతానికి చెందిన వేలుసామి (35) అనే వ్యక్తితో వివాహానికి ముందే పరిచయం ఏర్పడి సంబంధం ఉందని, ఈ క్రమంలో పెళ్లి చూపులకు ఎవరు వచ్చినా తాను వివాహం చేసుకోనని దీప తెలిపినట్లు తెలిసింది.

దీంతో బంధువులు దీపను ఒప్పించి బంధువుకు వివాహం చేశారు. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనతో ఉన్న దీప బలవన్మరణానికి పాల్పడింది. దీంతో పోలీసులు కేసు నమోదుచేసి ఆత్మహత్యకు ప్రేరేపించిన మాజీ ప్రియుడు వేలుసామిని అరెస్టు చేశారు.  

మరిన్ని వార్తలు