విషాదం: పెళ్లైన 20 రోజులకే నవ వధువు ఆత్మహత్య 

14 Jun, 2021 08:44 IST|Sakshi
 అనురాధ (ఫైల్‌)

ఎమ్మిగనూరు రూరల్‌(కర్నూలు జిల్లా): వివాహమైన 20 రోజులకే ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.  పార్లపల్లి గ్రామానికి చెందిన మాదన్న, నయోమిల కుమార్తె ఎస్‌. అనురాధ గ్రామ వలంటీర్‌గా పనిచేస్తుంది. ఈ యువతికి ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన  బంధువు కిరణ్‌కు ఈ ఏడాది మే 24వ తేదీన వివాహమైంది. పెళ్లైన వారం రోజుల తర్వాత వలంటీర్‌గా సేవలందించేందుకు అనురాధ పార్లపల్లికి చేరుకుంది. ఆదివారం తల్లిదండ్రులు చర్చికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

చర్చి నుంచి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు విగతజీవిగా కనిపించిన కుమార్తెను చూసి బోరున విలపించారు. తమ కుమార్తెకు కొన్నాళ్లుగా కడుపునొప్పి ఉందని, నయం కాకపోవడంతో మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలు కుటుంబీకులు పోలీసులకు తెలిపారు.  విషయం తెలుసుకున్న రూరల్‌ ఎస్‌ఐ సునీల్‌కుమార్‌ గ్రామానికి వెళ్లి ఆరా తీశారు. పోస్టుమార్ట్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

చదవండి: నిత్య పెళ్లికూతురు కేసులో మరో మలుపు     
వైద్యుడి కుటుంబంలో ఊహించని విషాదం

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు