వనస్థలిపురం దోపిడీ కేసులో కొత్త ట్విస్ట్‌.. డైరీలో షాకింగ్‌ విషయాలు

9 Jan, 2023 19:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వనస్థలిపురం దోపిడీ కేసులో కొత్త ట్విస్ట్‌ చోటుచేసుకుంది. హవాలా డబ్బుల కోసమే వెంకట్రామిరెడ్డి డ్రామా ఆడినట్లు తేలింది. మూడు రోజుల క్రితం రూ.2 కోట్లు తీసుకెళ్తుండగా అర్థరాత్రి దారి దోపిడీ జరిగినట్లు వెంకట్రామిరెడ్డి ఫిర్యాదు చేశారు. వెంకట్రామిరెడ్డి వాట్సాప్‌ చాటింగ్‌ ఆధారంగా హవాలా లింక్స్‌ గుర్తించిన పోలీసులు.. ఆయన ఇంట్లో సోదాలు చేపట్టారు.

నగదు లావాదేవీలకు సంబంధించిన డైరీలు స్వాధీనం చేసుకున్నారు. పాతబస్తీకి చెందిన ఫారుఖ్‌తో కలిసి హవాలా లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. వెంకట్రామిరెడ్డి, ఫారుక్‌ల హవాలా లావాదేవీలపై పోలీసులు విచారణ చేపట్టారు.
చదవండి: ‘జిలేబీ బాబా’ లీలలు.. ఏకంగా 120 మందిపై అకృత్యాలు.. అంతటితో ఆగకుండా..

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు