కొత్త రకం మోసం: ఫిట్స్‌ వచ్చిన వాడిలా నటిస్తాడు.. ఆ తర్వాత..

28 Aug, 2021 19:53 IST|Sakshi

అయ్యో పాపం అని జాలి తలిస్తే ఫోన్‌ మాయం..! 

పెదకాకాని(గుంటూరు జిల్లా): కింద పడిన వ్యక్తిని పైకి లేపి కూర్చోబెడదామని జాలి తలిస్తే ఫోన్లు మాయం అవుతున్న ఘటన పెదకాకానిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే పెదకాకాని సెంటర్‌లో రోడ్డు పక్కనే జనాలు ఉన్న ప్రదేశంలో వారు చూస్తూ ఉండగానే ఓ వ్యక్తి ఫిట్స్‌ వచ్చిన వాడిలా కిందపడి కొట్టుకుంటూ ఉంటాడు. అయ్యో పాపం అని జాలి చూపి అతనిని పైకి లేపేందుకు ఒకరు, అతని చేతిలో తాళాలు పెట్టాలని మరొకరు అక్కడికి చేరుకుంటారు. వారితో పాటే కింద పడిన వ్యక్తిని అనుసరిస్తూ వచ్చిన వ్యక్తి కూడా అక్కడికి చేరుకుని సహాయం చేస్తున్నట్లు వారిలో కలుస్తాడు.

కొద్దిసేపటికి ఫిట్స్‌ వచ్చి పడిపోయిన వాడిలా నటించిన వ్యక్తి కోలుకుంటాడు. అతని అనుచరుడు మాత్రం అక్కడ కనిపించడు. కొద్దిసేపటి తరువాత చూసుకుంటే అప్పటికే జేబులో, హడావుడిలో పక్కన పెట్టిన ఫోన్‌ కనిపించకుండా పోతుంది. పెదకాకాని సెంటర్‌లో ఇదే తరహాలో కోటేశ్వరరావు ఫోన్‌ మాయం కాగా, సాయం చేసేందుకు చెయ్యేసిన బోయపాటి రామ్మోహన్‌ ఫోన్‌ సుందరయ్యకాలనీ వద్ద కాజేశారు. ఇలాంటి మోసాలకు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని వారు కోరుతున్నారు. జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇవీ చదవండి:
సినిమా స్టైల్లో అదిరిపోయే ట్విస్ట్‌: నిన్న షాక్‌.. నేడు ప్రేమపెళ్లి
పాలగుమ్మిలో అరుదైన నీటికుక్కల సందడి 

మరిన్ని వార్తలు