విషాదం: పెళ్లి విషయంలో ధైర్యం చూపారు.. బతికే విషయంలో తెగువ చూపలేక..

28 Oct, 2021 08:35 IST|Sakshi
హరీష్‌, దివ్య (ఫైల్‌) 

తునివాడలో విషాదకర ఘటన

రెండు కుటుంబాల్లో అంతులేని ఆవేదన

సాక్షి, రేగిడి (శ్రీకాకుళం): ఇద్దరూ బాగా చదువుకున్న వాళ్లు. మంచి చెడులు ఆలోచించగల విచక్షణ ఉన్నవారు. కష్టాలు కలకాలం ఉండవనే నిజం తెలిసిన వారే. అయినా క్షణికావేశానికి గురయ్యారు. పెళ్లి విషయంలో ధైర్యం చూపిన ఈ దంపతులు.. బతికే విషయంలో మాత్రం తెగువ చూపలేకపోయారు. రేగిడి మండలంలోని తునివాడకు చెందిన నవ దంపతులు పల్లి హరీష్‌(29), రుంకు దివ్య(20) బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ బలవన్మరణం వెనుక కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎస్‌ఐ షేక్‌ మహమ్మద్‌ ఆలీ తెలిపిన వివరాల ప్రకారం..  

చదవండి: (పుట్టినింటికి వచ్చిన చెల్లెని హతమార్చి.. పోలీస్‌స్టేషన్‌లో లొంగుబాటు)

వివరాలు సేకరిస్తున్న ఎస్‌.ఐ షేక్‌ మహమ్మద్‌ ఆలీ

మండలంలోని తునివాడ గ్రామానికి చెందిన పల్లి హరీష్‌ ఎంసీఏ చదివాడు. అదే గ్రామానికి చెందిన రుంకు దివ్య డిగ్రీ ఫైనలియర్‌ చదువుతోంది. ఒకే గ్రామం, ఒకే సా మాజిక వర్గానికి చెందిన వీరి మధ్య కొన్నేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 1న వీరు అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో స్నేహి తుల సమక్షంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత విశాఖలో కొత్త కాపురం పెట్టారు. ఇద్దరూ ఉద్యోగాల వేటలో పడ్డారు. రెండు రోజుల కిందటే ఊరికి వచ్చిన ఈ దంపతులు అబ్బాయి ఇంటిలో ఉన్నారు. బుధవారం ఏమైందో గానీ ఇద్దరూ ఇంటిలో ఉన్న ఫ్యానుకు ఉరి వేసుకుని విగతజీవులయ్యారు.  

కేసు నమోదు 
విషయం తెలిసిన వెంటనే సీఐ జి.శంకరరావు, ఎస్‌ఐ షేక్‌ మహమ్మద్‌ ఆలీ తునివాడ గ్రామానికి చేరుకుని సంఘటనా స్థలాన్ని, ఇంటిని పరిశీలించా రు. వీరితో పాటు క్లూస్‌ టీమ్, డాగ్‌ స్క్వాడ్‌ కూడా వచ్చింది. అనంతరం శవ పంచనామా చేసి రాజాం సామాజిక ఆస్పత్రికి పోస్టుమార్టంకు తరలించారు.

చదవండి: (కర్కోటక తండ్రి.. కుమారుని గృహ నిర్బంధం)

మరిన్ని వార్తలు