పెళ్లైన 10 రోజులకే నవ వరుడికి పదేళ్ల జైలు శిక్ష

26 Mar, 2021 09:02 IST|Sakshi

తిరువొత్తియూరు: ఏడేళ్ల బాలికను లైంగికంగా వేధించిన నవ వరుడికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు చెప్పింది. తిరుపత్తూరు జిల్లా నాట్రాంపల్లి సమీపంలో ఉన్న పుదుపేట ప్రాంతం పక్రి మఠం  గ్రామానికి చెందిన యువకుడు విఘ్నేష్‌ (25). ఇతను 2018వ సంవత్సరం ఆగస్టు  27వ తేదీ ఏడేళ్ల బాలికను లైంగికంగా వేధించాడు. ఈ సంఘటనపై కేసు విచారణ వేలూరు సత్‌వాచ్చారి శాంతిభద్రతలు కోర్టు ప్రాంగణంలో వున్న ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతూ వచ్చింది. ఈ కేసుకు విచారణ గురువారం రాగా న్యాయమూర్తి సెల్వం కేసును పరిశీలించి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు గాను విఘ్నేష్‌కు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ముద్దాయి విఘ్నేష్‌కు పది రోజుల ముందే వివాహం కావడం గమనార్హం.   

చదవండి: చిన్నారిపై వృద్ధ జంట వికృత చేష్టలు.. ఊయలలో ఆడించి

మరిన్ని వార్తలు