ఇష్టం లేని పెళ్లి చేశారంటూ యువతి..

8 Jun, 2022 12:43 IST|Sakshi

ఇష్టం లేని పెళ్లి చేశారని యువతి పురుగుల మందు తాగగా, భార్య విడాకులు ఇచ్చిందని భర్త బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు జనగామ, మహబూబాబాద్‌ జిల్లాల్లో మంగళవారం చోటుచేసుకున్నాయి. 

వరంగల్ (చిల్పూరు): జనగామ జిల్లా చిల్పూరు మండల కేంద్రంలోని కొత్తపల్లెకు చెందిన దామెర రేఖ (22) తనకు ఇష్టం లేని పెళ్లి చేశారంటూ మంగళవారం తెల్లవారుజామున క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై రాజు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కొత్తపల్లెకు చెందిన దామెర లచ్చమ్మ కుమారుడు రాజ్‌కుమార్‌కు స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన గొడిశాల కుమారస్వామి–స్వరూపల కుమార్తె రేఖతో గత మార్చి 30వ తేదీన వివాహం జరిగింది.

పెళ్లి అయిన నాటినుంచి ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని రేఖ భర్తతో ఎడమొహం పెడమొహంగా ఉండేది. కొద్దిరోజులు పుట్టింటికి పంపితే మారుతుందని పంపించారు. సోమవారం రేఖను తిరిగి చిల్పూరుకు తీసుకువచ్చారు. మంగళవారం తెల్ల వారు జామున క్రిమిసంహారక మందు తాగి అపస్మారకస్థితిలోకి వెళ్లింది. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

భార్య విడాకులు ఇచ్చిందని భర్త.. 
గార్ల : మహబూబాబాద్‌ జిల్లా గార్ల పంచాయతీ పరిధి గండి గ్రామానికి చెందిన అత్తులూరి భాస్కర్‌ (36)భార్య విడాకులు ఇచ్చిందని జీవితంపై విరక్తి చెంది బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పో లీసుల కథనం ప్రకారం.. అత్తులూరి భాస్కర్‌ గార్లలో బైక్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. 14 ఏళ్ల క్రితం అమలేశ్వరితో వివాహం జరిగింది. కొన్నేళ్లపాటు వీ రి వైవాహిక జీవితం సజావుగానే సాగింది. ఆరేళ్ల క్రితం భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో భార్య ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. గత జనవరిలో భార్య విడాకులు ఇచ్చింది.

భార్య లేదనే మనస్తాపంతో భాస్కర్‌ మ ద్యానికి బానిసయ్యాడు. జీవి తంపై విరక్తి చెందిన భాస్కర్‌ ఈ నెల 5న ఇంట్లో తల్లితండ్రులకు గార్ల వెళ్లొస్తానని చె ప్పి, ఇంటికి 100 మీటర్ల దూ రంలో గల వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం తెల్లవారుజామున గ్రా మానికి చెందిన ఓ వ్యక్తి బహిర్భూమికి వెళ్లగా భాస్కర్‌ బావిలో శవమై కనిపించగా కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. మృతుడి అన్న శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై బానోత్‌ వెంకన్న తెలిపారు. 

మరిన్ని వార్తలు