నవ వధువు ఆత్మహత్య.. గ్రామంలో ఉద్రిక్తత

28 Nov, 2020 09:04 IST|Sakshi
చైతన్య, తంగవేల్‌ పెళ్లి ఫొటో (ఫైల్‌)

సాక్షి, చిత్తూరు (కుప్పం): ఇష్టంలేని పెళ్లి చేశారని నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. దీంతో మృతురాలి అన్నదమ్ములు తమ బంధువులతో వరుడి ఇంటిపై దాడి చేసి వస్తుసామగ్రిని ధ్వంసం చేశారు. ఇంటికి నిప్పు పెట్టారు. పోలీసుల కథనం..మండలంలోని మంకలదొడ్డికి చెందిన శ్రీనివాసులు కుమార్తె చైతన్య (22)కు కుర్మానుపల్లెకు చెందిన తంగవేల్‌ (24)కిచ్చి గత నెల 29న వివాహం చేశారు. చైతన్యకు పెళ్లి ఇష్టం లేకపోవడంతో దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ విషయాన్ని తంగవేల్‌ తన మామ శ్రీనివాసులుకు చెప్పాడు.  చదవండి: (మైనర్‌పై పలుమార్లు అత్యాచారం..)

ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున చైతన్య అత్తగారింట బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇదే రోజు రెండు గ్రామాల పెద్దలు రాజీ చేసి మృతురాలికి అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో తమ సోదరి మరణాన్ని జీర్ణించుకోలేక మృతురాలి అన్నదమ్ములు తమ బంధువులతో కలిసి శుక్రవారం తంగవేల్‌ ఇంటిపై దాడి చేసి వస్తుసామగ్రిని ధ్వంసం చేశారు. ఇంటికి నిప్పు పెట్టారు. ఇది గ్రామంలో ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరువర్గాలపై  కేసు సమోదు చేసినట్లు అర్బన్‌ సీఐ శ్రీధర్, ఎస్‌ఐ నరేంద్ర తెలిపారు.


తంగవేల్‌ ఇంటి వద్ద గొడవ చేస్తున్న మృతురాలి బంధువులు 

మరిన్ని వార్తలు