నవవధువు అదృశ్యం 

24 Jun, 2021 11:20 IST|Sakshi

సాక్షి, నల్లకుంట(హైదరాబాద్‌): వివాహమైన మూడు వారాలకే ఓ నవ వధువు అదృశ్యమైన  సంఘటన నల్లకుంట పీఎస్‌ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. అడిక్‌మెట్‌ బాలాజీనగర్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి బుగుడుల సాయికుమార్‌కు సిద్దిపేట తోగుట గ్రామానికి చెందిన సీహెచ్‌.అంజయ్య కుమార్తె  నాగరాణి (20)తో  మే 30న వివాహం జరిగింది. రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం సాయికుమార్‌ విధులకు వెళ్లిపోయాడు. ఇంట్లోనే ఉన్న నాగరాణి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా మధ్యాహ్నం తన బట్టలు, బంగారు ఆభరణాలు తీసుకుని వెళ్లిపోయింది. కొద్ది సూటి తర్వాత గమనించిన వదిన రేణుక వెంటనే సాయి కుమార్‌కు ఫోన్‌ చేసి నాగరాణి కనిపించడం లేదంటూ చెప్పింది.

వెంటనే ఇంటికి చేరుకున్న సాయికుమార్‌కు సెల్ఫ్‌లో భార్య సెల్‌ఫోన్‌ కనిపించింది. ఫోన్‌ స్విచ్‌ ఆన్‌ చేసి చూడగా అందులో బాయ్‌ ఫ్రెండ్‌ నుంచి వచ్చిన కొన్ని మెస్సేజెస్‌ ఉన్నాయి. ఆందోళన చెందిన సాయికుమార్‌ తన భార్య కనిపించడం లేదంటూ బుధవారం నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్‌ కేసుగా నమోదుచేసుకున్న పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు. తమ వివాహానికి ముందు కూడా  ఓ యువకుడితో నాగరాణి వెళ్లి పోయిందని, భార్య అదృశ్యం వెనకాల అతడి హస్తం ఉందని సాయికుమార్‌ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఏఎస్‌ఐ రమాదేవి కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

చదవండి: ఆన్‌లైన్‌ క్లాసులో అనామకుడి అల్లరి చేష్టలు..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు