సచిన్‌వాజే  హైఎండ్‌ బైక్‌ స్వాధీనం, కీలక సీసీటీవీ ఫుటేజీ

6 Apr, 2021 13:21 IST|Sakshi

సాక్షి, ముంబై: ముంబై మాజీపోలీసు అధికారిక సచిన్‌వాజేకు సంబంధించి  నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) సోమవారం హై ఎండ్ బైక్‌ను స్వాధీనం చేసుకుంది. ఫిబ్రవరి 25 న పారిశ్రామికవేత్త ముఖ్‌శ్‌ అంబానీ నివాసం ఆంటిలియా సమీపంలో పేలుడు పదార్థాలతో నిండిన ఎస్‌యూవీ, వాహన యజమాని మన్సుఖ్‌ హిరేన్‌ అనుమానాస్పద మరణంలో సచిన్ వాజ్ పాత్రపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకున్న వాహనాల సుదీర్ఘ జాబితాలో తాజాగా బైక్‌  చేరింది. అలాగే సచిన్‌ వాజేతో సంబంధంముందని భావిస్తున్న మహిళను కూడా ఎన్‌ఐఏ ప్రశ్నించింది. మహిళ ఆధీనంలో ఉన్న మీరా రోడ్ ఏరియాలోని ఒక ఫ్లాట్‌ను కూడా శోధించినట్లు ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు.

అలాగే  కీలకమైన సిసిటివి ఫుటేజ్‌ను కూడా సాధించింది.  సచిన్ వాజే మార్చి 4 న రాత్రి 7 గంటలకు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌కు వెళుతున్నట్లు వీడియోను గుర్తించారు. అదే రోజు  సీన్‌ రీక్రియేషన్‌ కోసం  థానే వెళ్లారు. అయితే  మార్చి 5 న థానేలోని కల్వా లేక్‌ వద్ద మన్సుఖ్ హిరెన్ మృతదేహం పలు అనుమానాల్ని రేకెత్తించింది. ఈ కేసును కూడా మన్సుఖ్‌ భార్య ఫిర్యాదు మేరకు ఎన్‌ఐఏ దర్యాప్తు జరుపుతోంది. అంబానీ ఇంటి  ఎస్‌యూవీని పార్కింగ్ చేయడంలో  వాజే పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న దర్యాప్తు సంస్థ తన కదలికలను దాచడానికి నకిలీ వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లను ఉపయోగించాడని ఆరోపించిన సంగతి తెలిసిందే.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు