గిఫ్ట్‌ ఫ్రాడ్‌ కేసులో నైజీరియన్‌ అరెస్ట్‌

19 Dec, 2021 08:43 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌  కస్టమ్స్‌ అధికారిగా ఫోన్‌ చేసి అందినకాడిక దండుకుంటున్న నైజీరియన్‌ను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏసీసీ కేవీఎం ప్రసాద్‌ తెలిపిన మేరకు.. ఈస్ట్‌ మారెడ్‌పల్లికి చెందిన ఓ మహిళకు యూకేకు చెందిన డాక్టర్‌ హెర్మన్‌ లియోన్‌ అనే పేరుతో ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చింది. రిక్వెస్ట్‌  యాక్సెప్ట్‌ చేయగా ఆమెకు హెర్మన్‌ వాట్సాప్‌ నంబర్‌ను ఇచ్చాడు. తక్కువ సమయంలో వీళ్లిద్దరు మంచి స్నేహితులయ్యారు.  

యూకే నుంచి 40 వేల పౌండ్ల విలువైన పార్సిల్‌ను బహుమతిగా పంపిస్తున్నానని హెర్మన్‌ తెలిపాడు. పార్సిల్‌ కోసం  మనీ లాండరింగ్‌ చార్జీలు, ఆదాయ పన్ను, బీమా వంటి రకరకాల చార్జీలు చెల్లించాలని తెలపగా.. వేర్వేరు ఖాతాలకు రూ.38.57 లక్షలు సమర్పించుకుంది. ఎంతకీ పార్సిల్‌ ఇంటికి రాకపోవటంతో నిరాశ చెందిన సదరు మహిళ.. తాను మోసపోయానని తెలుసుకొని గతేడాది మే 27న సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారలను సేకరించి ఢిల్లీలోని జనక్‌పురిలో నివాసం ఉంటున్న నైజీరియన్‌ ఒనేకా సొలమన్‌ విజ్‌డమ్‌ అలియాస్‌ సైమన్‌ను అరెస్ట్‌ చేశారు. నిందితుడి నుంచి 7 సెల్‌ఫోన్లు, రెండు బ్యాంక్‌ ఖాతా పుస్తకాలు, ఒక డెబిట్‌ కార్డ్‌ స్వాధీనం చేసుకున్నారు.  

(చదవండి: ఆ నేరానికి గానూ... ఒక వ్యక్తికి ఐదేళ్లు జైలు శిక్ష!!)

మరిన్ని వార్తలు