నగరంలో నిత్యపెళ్లికొడుకు ఆగడాలు: ఆడపిల్లలు పుడుతున్నారంటూ..

20 Feb, 2024 12:01 IST|Sakshi

హైదరాబాద్: భార్య బతికుండానే చనిపోయిందని మరో పెళ్లి చేసుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. కట్టుకున్న భార్యకు ఆడపిల్లలు పడుతున్నారని ఏకంగా 4 సార్లు అబార్షన్ చేయించాడు. హైదరాబాద్‌లో నాగోల్ జైపురి కాలనీలో నివాసం ఉండే అమరేందర్ భార్య బతికి వుండగానే మరో  పెళ్లి చేసుకున్నాడు.  తాజాగా వెలుగు చూసిన నిత్య పెళ్లి కొడుగు ఆగడాలు తీవ్ర కలకలం రేపాయి. 

భార్య చనిపోయిందంటూ అమరేందర్ అనే వ్యక్తి మరో పెళ్లి చేసుకున్నాడు. ఆడపిల్లలు పుడుతున్నారని భార్యకు అమరేందర్ నాలుగు సార్లు అబార్షన్లు చేయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాధితురాలికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నట్లు సమాచారం. భార్య బతికి ఉండగానే చనిపోయిందని.. అమరేందర్ మరో పెళ్లి చేసుకున్నాడు. అమరేందర్ హై కోర్టు న్యాయవాదిగా చలామణి అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సరూర్ నగర్ ఉమెన్స్ పోలీసు స్టేషన్‌లో అమరేందర్‌పై తాజాగా కేసు నమోదైంది.

భార్య బతికి ఉన్నా చనిపోయిందని వేరే పెళ్లి చేసుకున్నాడు. అంతేకాక ఇతను రాజకీయాల్లోనూ జోక్యం ఉంది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత తెలంగాణ రైతు రాజ్య సమితి (TRS) అనే ఒక పార్టీని అమరేందర్ రిజిస్టర్ చేయించుకున్నాడు. అమరేందర్ తండ్రి రిటైర్డ్ మెజిస్ట్రేట్ అంటూ పలువురిని మోసం చేస్తున్నారని బాధితురాలు కూడా ఆరోపిస్తోంది. ఇప్పటికే సరూర్ నగర్ ఉమెన్ పీఎస్ లో అమరేందర్ పై కేసు నమోదు అయింది. అమరేందర్ బారిన పడ్డ పలువురు బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని బాధితురాలైన అమరేందర్ భార్య వేడుకుంటున్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు