మద్యానికి డబ్బివ్వలేదని ఉన్మాదం

1 May, 2022 09:38 IST|Sakshi

మైసూరు: తాగుడుకు బానిసైన వ్యక్తి మద్యానికి కుటుంబ సభ్యులు డబ్బులు ఇవ్వలేదని ఉన్మాదిగా మారాడు. మహాభారత కాలంలో కంసుడు చేసినట్లుగా చెల్లెలి 8 నెలల బిడ్డను గోడకు కొట్టి హత్య చేసిన దురాగతం మైసూరు నగరంలో చోటు చేసుకుంది. కనకగిరిలోని 5వ క్రాస్‌లో నివాసం ఉంటున్న సిద్దమ్మ అనే మహిళ కుమారుడు రాజు (30) ఈ ఘోరానికి పాల్పడినవాడు. ఇతడు చిన్నా చితకా పనులు చేస్తూ ఆ డబ్బుతో మద్యం తాగుతుంటాడు. శుక్రవారం సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో ఇంటికి వచ్చి మద్యం డబ్బులు కావాలని తల్లిని అడిగాడు.

తన వద్దలేవని చెప్పగా ఇంటిలో ఉన్న చెల్లెలిని అడిగాడు. ఆమె కూడా లేవని చెప్పడంతో రాజు తీవ్ర ఆవేశానికి లోనయ్యాడు. ఇంట్లో ఉన్న టీవీని పగలగొట్టాడు. అంతటితో ఆగకుండా ఊయల్లో పడుకున్న 8 నెలల శిశువును తీసుకుని గోడకు విసిరికొట్టడంతో చిన్నారి ప్రాణాలు విడిచింది. దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానిక విద్యారణ్యపుర పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి రాజు కోసం గాలింపు చేపట్టారు.

(చదవండి: నాకు ప్రియుడే ముఖ‍్యం.. భార్య ఏం చేసిందంటే..?  )

మరిన్ని వార్తలు