దేవుడి హుండీల్లో అశ్లీల చీటీలు, కండోమ్‌లు..

2 Apr, 2021 07:19 IST|Sakshi

యశవంతపుర: ఆలయాల్లోని హుండీల్లోకి అశ్లీల సందేశాలు రాసిన చీటీలు,కండోమ్స్‌ వేసిన మంగళూరులోని జొకట్టి నివాసి అబ్దుల్‌రహీం, అబ్దుల్‌ తౌఫీక్‌ అనే నిందితులను మంగళూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులు బుధవారం ఎమ్మెకెరె కొరగజ్జ ఆలయంలో ఉండగా స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెళ్లి అరెస్ట్‌ చేశారు. నిందితులు మూడు నెలలుగా  పాండేశ్వర, కద్రి, ఉళ్లాల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఆలయాల్లో ఆకతాయి చర్యలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు.   

మరిన్ని వార్తలు